MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-do-you-know-how-many-heroes-in-our-tollywood-have-their-own-planes2148c179-44ab-4de4-a02c-8360eca41a22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-do-you-know-how-many-heroes-in-our-tollywood-have-their-own-planes2148c179-44ab-4de4-a02c-8360eca41a22-415x250-IndiaHerald.jpgమాములుగా మన దగ్గర ఏ వ్యాపార వేత్తలకో.. లేక పారిశ్రామిక రంగానికి చెందిన ధనవంతులకో సొంత విమానాలు ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు సినీ సెలెబ్రెటీలకు కూడా సొంత చార్టెడ్ ఫ్లయిట్స్,జెట్ ఫ్లయిట్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా..??కానీ ఇది నిజం మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. టాలీవుడ్ హీరోల్లో పలువురికి తమదైన సొంత విమానాలు ఉండటం విశేషంగా చెప్పాలి.ఇటీవల జరిగిన నాగబాబు కుమార్తె నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగటం తెలిసిందే. దీని కోసం తమ సొంత విమానాల్లో కుటుంబ సభ్యులతో సహాtollywood actors;business;ntr;allu arjun;jr ntr;niharika konidela;tara;udaipur;hyderabad;rajasthan;tollywood;cinema;bigboss;marriage;hero;nandamuri taraka rama rao;arjun 1;manamమన టాలీవుడ్లో ఎంతమంది హీరోలకు సొంత విమానాలు ఉన్నాయో తెలుసా..??మన టాలీవుడ్లో ఎంతమంది హీరోలకు సొంత విమానాలు ఉన్నాయో తెలుసా..??tollywood actors;business;ntr;allu arjun;jr ntr;niharika konidela;tara;udaipur;hyderabad;rajasthan;tollywood;cinema;bigboss;marriage;hero;nandamuri taraka rama rao;arjun 1;manamSat, 02 Jan 2021 20:00:00 GMTటాలీవుడ్ హీరోల్లో పలువురికి తమదైన సొంత విమానాలు ఉండటం విశేషంగా చెప్పాలి.ఇటీవల జరిగిన నాగబాబు కుమార్తె నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగటం తెలిసిందే. దీని కోసం తమ సొంత విమానాల్లో కుటుంబ సభ్యులతో సహా వెళ్లటంతో.. టాలీవుడ్ హీరోల రేంజ్ కొత్త చర్చకు తెర తీసింది. టాలీవుడ్ హీరోల్లో సొంత విమానాలు ఉన్న వారి జాబితా కాస్త పెద్దదిగానే చెప్పాలి.సీనియర్ నటుల విషయానికి వస్తే.. హీరో నాగార్జునకు సొంత విమానం ఉందంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లటానికి దీన్ని వాడుతుంటారు.

తాజాగా తన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం దీన్ని వాడారు. దీనికి కారణం.. సినిమా షూటింగ్ మధ్యలో బిగ్ బాస్ షూటింగ్ కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దీంతో.. ఆయన తన సొంత విమానాన్ని వాడారు.నిహారిక పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీలోని హీరోలకు సొంత విమానాలు ఉన్న విషయం బయటకు వచ్చింది. అల్లు అర్జున్ తన సొంత విమానంలోనే ఆ పెళ్లికి వెళ్లారు. చిరు ఫ్యామిలీకి సొంత ఫ్లైట్ ఉంది. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని కొనుగోలు చేశారని చెబుతారు. నిహారిక పెళ్లికి తమ సొంత విమానంలోనే వారు వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ కు సొంత విమానం ఉంది. ఈ మధ్యనే రూ.80 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.మరి..

సొంత విమానాలు ఉన్న హీరోలు వాటిని ఎక్కడ ఉంచుతారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇట్టే వచ్చేస్తుంది. తమకు సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులో వాటిని ఉంచి.. నిర్వహణ ఒప్పందాలు ఆయా ఎయిర్ పోర్టులోని కంపెనీలతో చేసుకుంటాయి. అంతేకాదు.. తమకు అవసరంలేని సందర్బాల్లో ఛార్టెడ్ విమానాల్ని అద్దెకు కూడా ఇస్తున్నారట..మొత్తానికి మన టాలీవుడ్ సెలెబ్రెటీలు మాత్రం ఈ విషయంలో బిజినెస్ మ్యాన్స్ ని సైతం మించి పోయారనే చెప్పాలి...మరి ఒక్కో సినిమాకు పారితోషకంగా కోట్లు కోట్లు తీసుకుంటుంటే ఒక్క విమానం ఏం కర్మ ఇంకా అలాంటివి మరో పది తీసుకున్న ఆశ్చర్య పోనక్కర్లేదు.. ఏమంటారు...!!


ప్రభాస్ పక్కన ఎవరూ ఊహించని హీరోయిన్ ?

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>