MoviesSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/satyadev736ba98c-33c5-4611-b12c-3d3a1228cf95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/satyadev736ba98c-33c5-4611-b12c-3d3a1228cf95-415x250-IndiaHerald.jpgత‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో స‌త్య‌దేవ్ అతి త‌క్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న బ‌డ్జెట్ నిర్మాత‌ల‌కు మంచి ఛాయిస్‌గా మారారు. అయితే బ్ల‌ఫ్‌మాస్ట‌ర్‌తో పాటు ప‌లు చిత్రాల్లో న‌ట‌న ప్ర‌తిభ‌తో ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించ‌నున్నారు. మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశాత్satyadev;chiranjeevi;mahesh;ram charan teja;shiva;bharath;koratala siva;ram pothineni;ramya krishnan;vivek;sri bharath;cinema;satyadev;konidela production;remake;lord siva;hero;reddy;chitramచిరంజీవి సినిమాలో విల‌న్‌గా బ్ల‌ఫ్‌మాస్ట‌ర్‌ స‌త్య‌దేవ్‌...చిరంజీవి సినిమాలో విల‌న్‌గా బ్ల‌ఫ్‌మాస్ట‌ర్‌ స‌త్య‌దేవ్‌...satyadev;chiranjeevi;mahesh;ram charan teja;shiva;bharath;koratala siva;ram pothineni;ramya krishnan;vivek;sri bharath;cinema;satyadev;konidela production;remake;lord siva;hero;reddy;chitramSat, 02 Jan 2021 11:12:13 GMTస‌త్య‌దేవ్ అతి త‌క్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న బ‌డ్జెట్ నిర్మాత‌ల‌కు మంచి ఛాయిస్‌గా మారారు. అయితే బ్ల‌ఫ్‌మాస్ట‌ర్‌తో పాటు ప‌లు చిత్రాల్లో న‌ట‌న ప్ర‌తిభ‌తో ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించ‌నున్నారు. మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశాత్మక అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవి కోసం చాలా రోజులు వెయిట్ చేసిన కొరటాల.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.


సినిమా త‌ర్వాత చిరంజీవి లూసీఫర్‌లో న‌టించ‌నున్నాడు. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో యంగ్ హీరో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో పాటు 2020లో డిజిటల్ రంగంలో వరస విజయాలు అందుకున్న సత్యదేవ్ ఇప్పుడు చిరు సినిమాలో విల‌న్‌గా కనిపించబోతున్నాడని ప్రచారమైతే ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జరుగుతోంది.  లూసీఫర్ రీమేక్ లో ఈయన విల‌న్‌గా లేదంటే యంగ్ చీఫ్ మినిస్ట‌ర్  పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.


మలయాళంలో వివేక్  ఒబేరయ్ నటించిన పాత్రలో ఇక్కడ సత్యదేవ్ కనిపించబోతున్నాడని తెలుస్తోంది. దీనిపై చిత్రయూనిట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించబోతుంది. ఇదిలా ఉండ‌గా సత్యదేవ్ హీరోగా రూపొందుతోన్న మరో చిత్రం ‘తిమ్మరుసు’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్లపై మహేష్ కోనేరు, శ్రుజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రం ఆసక్తినిరేపుతోంది. బ్లఫ్‌ మాస్టర్‌తో హీరోగా మెప్పించిన సత్యదేవ్‌ రీసెంట్‌గా విడుదలైన విలక్షణ చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలోనూ వైవిధ్యమైన టైటిల్‌ పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనపరుస్తున్నారు.




విలన్ గా సత్యదేవ్ చిరంజీవిని మెప్పించగలడా ?

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>