Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2021-tollywood-movies-listf7e9bcc9-15dc-446e-9129-9d3656cf5964-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/2021-tollywood-movies-listf7e9bcc9-15dc-446e-9129-9d3656cf5964-415x250-IndiaHerald.jpgఅతి కష్టం మీద 2020 గండం గడిచిపోయింది. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి ఎన్నడూ మర్చిపోలేని విధంగా గుర్తుండి పోయింది. కొందరికీ ఈ ఏడాది బ్యాడ్ ఇయర్ గా గుర్తుండి పోతే మరికొందరికి అద్బుత అవకాశాలను అందించి గొప్ప పేరు తెచ్చిన ఏడాదిగా గుర్తిండి పోయింది. అతి తక్కువ మందికే 2020 కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ సినిమాలతో 2020 గడిచిపోయింది. అందుకే 2021 లో అయినా క్రేజ్ ను పొందాలని చూస్తున్నారు నటీనటులు. మరి 2021 కొన్ని ప్రాజెక్ట్స్ పట్ల ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అవేంటో మరీ కూడా ఒక సారి megastar chiranjeevi;pawan;chiranjeevi;prabhas;ravi;venkatesh;rana;balakrishna;ram charan teja;shiva;allu arjun;anil music;anil ravipudi;boyapati srinu;kalyan;koratala siva;pawan kalyan;ram pothineni;ravi teja;varun;varun sandesh;varun tej;dussehra;bollywood;cinema;telugu;rajani kanth;tamil;asuran;f2;blockbuster hit;remake;director;lord siva;vijayadashami;success;pink;nandamuri taraka rama rao;arjun 1;darling;krack;narappa2021 లో బాక్సాఫీస్ ను షేక్ చేసేవి ఈ సినిమాలేనట..2021 లో బాక్సాఫీస్ ను షేక్ చేసేవి ఈ సినిమాలేనట..megastar chiranjeevi;pawan;chiranjeevi;prabhas;ravi;venkatesh;rana;balakrishna;ram charan teja;shiva;allu arjun;anil music;anil ravipudi;boyapati srinu;kalyan;koratala siva;pawan kalyan;ram pothineni;ravi teja;varun;varun sandesh;varun tej;dussehra;bollywood;cinema;telugu;rajani kanth;tamil;asuran;f2;blockbuster hit;remake;director;lord siva;vijayadashami;success;pink;nandamuri taraka rama rao;arjun 1;darling;krack;narappaSat, 02 Jan 2021 14:43:25 GMTఈ మూవీని రూ.450 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్లు సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దీని తర్వాత సక్సెస్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, కొడుకు రామ్ చరణ్ లు కలిసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పట్ల మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనితో పాటుగా 2021 లో మెగాస్టార్ చిరు మలయాల మూవీ రీమేక్ లో కూడా నటించనున్నారు. ఈ మూవీ కూడా ఈ ఏడాదిలోనే తెరపైకి రానుంది. వీరితో పాటుగా ఈ ఏడాది యాక్షన్ ప్రేక్షకులను అలరించడానికి బోయపాటి డైరెక్షన్ లో నందమూరి బాలయ్య బాబు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే తమిళంలో ఘనవిజయం సాదించిన అసురన్ రీమేక్  తెలుగులో ‘నారప్ప’ తో విక్టరీ వెంకటేష్ వేసవిలో ఆభిమానుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 ఈ ఏడాది మళ్లీ నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్దమైంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో రాబోతుంది.

అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ మూవీ వేసవి ఎంటర్ టైనర్ గా  తెరకెక్కనుంది.  ఇదిలా ఉంటే మూడేళ్ల తర్వాత మళ్లీ తెరముందుకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ కూడా ఈ ఏడాదిలో  సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ రీమేక్ కి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియ్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ ఈ వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ డార్లింగ్ యాక్షన్ మూవీ సలార్ సినిమానేమో దసరా కానుకగా విడుదల కానుంది. వీటితో పాటుగా సూపర్ స్టార్ ‘సర్కారు వారి పాట’ కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే అలా వైకుంఠపురములో సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’ సినిమాతో మరో హిట్ ను ఈ ఏడాది తన ఖాతాలో వేసుకోనున్నాడు.  ఈ సినిమాలతో పాటుగా రవితేజ క్రాక్, ఖిలాడి సినిమాలు కూడా ఈ ఏడాది బరిలోనే దిగనున్నాయి.




బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?

జగన్ సర్కార్ కు "కాగ్" శుభవార్త ....!?

"షోజ్" నోటీసు తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...!?

కేకు కోస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత.. అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>