PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdbefcb98-6aa6-4d22-9f37-ae7884fe5903-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdbefcb98-6aa6-4d22-9f37-ae7884fe5903-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు పడుతున్న కష్టాలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఒకవైపు బీజేపీ అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టిఆర్ఎస్ కు ఎక్కడా లోటులేకుండా చేసుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలలో పోయిన పరువును నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే గెలుపునకు ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు బలమైన అభ్యర్థిని ఇక్కడ పోటీకి దించాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సkcr telangana trs nagarjuna sagar;auto;kcr;bharatiya janata party;telangana;congress;nalgonda;wife;letter;janareddy;reddy;party;sasanamandaliకేసీఆర్ ఓటు ఈ ముగ్గురిలో ఎవరికో ?కేసీఆర్ ఓటు ఈ ముగ్గురిలో ఎవరికో ?kcr telangana trs nagarjuna sagar;auto;kcr;bharatiya janata party;telangana;congress;nalgonda;wife;letter;janareddy;reddy;party;sasanamandaliSat, 02 Jan 2021 01:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు పడుతున్న కష్టాలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఒకవైపు బీజేపీ అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టిఆర్ఎస్ కు  ఎక్కడా లోటులేకుండా చేసుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలలో పోయిన పరువును నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే గెలుపునకు ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు బలమైన అభ్యర్థిని ఇక్కడ పోటీకి దించాలని చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ సర్వేలు సైతం చేయిస్తున్నారు.






దుబ్బాక ఉప ఎన్నికలలో సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇచ్చినా, అక్కడ సెంటిమెంట్ రాజకీయం వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని సెంటిమెంట్ రాజకీయానికి పెద్ద పీట వేస్తే,  ఫలితం తేడా కొట్టే అవకాశం ఉందనే  భయంతో నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడటం లేదు. ఇప్పటికే ఆ విషయం కేసీఆర్ నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దానికి బదులుగా భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి నామినేటెడ్ పోస్టు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి వారిని ఒప్పించినట్టు తెలుస్తోంది.





ఇక ఇక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దించాలనే విషయంపై పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి గాని, ఆయన కుమారుడు కాని పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో , అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇస్తే గెలుపు తమ ఖాతలో పడుతుందని టిఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి.  నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి , అలాగే మరో సీనియర్ నాయకుడు ఎం సి కోటిరెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో కేసిఆర్ అనుగ్రహం ఎవరిపై ఉంటుంది అనే విషయంపైనా జోరుగా చర్చ జరుగుతోంది. వీరే కాకుండా మరికొందరి పేర్లు ఇప్పుడు ప్రచారం లోకి వస్తున్నాయి.



టీడీపీ కొత్త వ్యూహానికి జగన్ మార్క్ చెక్...!

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>