PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/uttam0b774adc-e889-4300-9377-5a7a1b69aaf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/uttam0b774adc-e889-4300-9377-5a7a1b69aaf2-415x250-IndiaHerald.jpgవరంగల్ జైలులో ఉన్న జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు, సీనియర్ నేతలు అయిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అలాగే వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులు వెళ్తున్న క్రమంలో కాజీపేట మండలం మడికొండ వద్ద ర్యాలీగా వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలు వెళ్లకుండా రహదారికి అడ్డంగా పోలీసులు తాడును కట్టారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.uttam;kumaar;murali;prasanth;tiru;venkat;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;warangal;telangana;congress;district;police;january;court;december;minister;reddy;etela rajender;janagama;gharshana;prashant kishorకాంగ్రెస్ నాయకులను అడ్డగించిన పోలీసులు... శివాలెత్తిన ఉత్తమ్, కోమటిరెడ్డిలుకాంగ్రెస్ నాయకులను అడ్డగించిన పోలీసులు... శివాలెత్తిన ఉత్తమ్, కోమటిరెడ్డిలుuttam;kumaar;murali;prasanth;tiru;venkat;telangana rashtra samithi trs;uttam kumar reddy nalamada;warangal;telangana;congress;district;police;january;court;december;minister;reddy;etela rajender;janagama;gharshana;prashant kishorSat, 02 Jan 2021 19:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లాలో కాంగ్రెస్ నేతలను అడ్డగించిన కారణంగా కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన అసలు వివరాల్లోకి వెళితే... వరంగల్ జైలులో ఉన్న జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు, సీనియర్ నేతలు అయిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అలాగే వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులు వెళ్తున్న క్రమంలో కాజీపేట మండలం మడికొండ వద్ద ర్యాలీగా వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలు ముందుకు వెళ్లకుండా రహదారికి అడ్డంగా పోలీసులు తాడును కట్టారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన వాహనం దిగి కొంతదూరం నడిచారు. ఆ తర్వాత కారెక్కి వరంగల్‌కి బయలుదేరారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.



 జంగా రాఘవరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి ప్రోద్బలంతోనే రాఘవరెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. అక్రమ అరెస్టులపై పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. జంగా రాఘవరెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్‌ చేశారు. కాజీపేట ప్రశాంత్ నగర్‌కి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో రాఘవ రెడ్డిని డిసెంబర్ 31వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మరికొన్ని కేసులు కూడా ఆయనపై పెట్టినట్లు సమాచారం. అయితే రాఘవ రెడ్డి కొంతకాలంగా పోలీసులకు దొరక్కుండా తిరుగుతుండగా డిసెంబర్‌ 31న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసుల విషయమై జనవరి 1న రాఘవరెడ్డిని కోర్టులో హాజరుపరిచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.


నాగార్జున వైల్డ్ డాగ్ ఓటిటి రిలీజ్.. డీల్ ఎంతంటే..!

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>