Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/a-fan-paid-team-india-hotel-bill-and-surprised-them7ac5bc2e-0890-41dd-aa0a-d2828d5752c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/a-fan-paid-team-india-hotel-bill-and-surprised-them7ac5bc2e-0890-41dd-aa0a-d2828d5752c3-415x250-IndiaHerald.jpg సెలబ్రిటీలు హోటళ్లకు వెళితే అక్కడి వారి కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. ఆటోగ్రాఫ్‌ల కోసం, సెల్ఫీల కోసం అభిమానులు పోటీ పడుతుంటారు. అయితే ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెటర్లకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఈ అభిమాని వారిని ఇబ్బంది పెట్టలేదు. ఓ సర్‌ప్రైజ్ ఇచ్చి.. షాక్‌కు ..team india;rohit;rohit sharma;india;korcha;january;twitter;rishabh pant;giftటీమిండియా ఆటగాళ్లను సర్‌ప్రైజ్ చేసిన అభిమాని.. వద్దన్న రోహిత్, హగ్ చేసుకున్న పంత్టీమిండియా ఆటగాళ్లను సర్‌ప్రైజ్ చేసిన అభిమాని.. వద్దన్న రోహిత్, హగ్ చేసుకున్న పంత్team india;rohit;rohit sharma;india;korcha;january;twitter;rishabh pant;giftSat, 02 Jan 2021 11:09:00 GMTఇంటర్నెట్ డెస్క్: సెలబ్రిటీలు హోటళ్లకు వెళితే అక్కడి వారి కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. ఆటోగ్రాఫ్‌ల కోసం, సెల్ఫీల కోసం అభిమానులు పోటీ పడుతుంటారు. అయితే ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెటర్లకు అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఈ అభిమాని వారిని ఇబ్బంది పెట్టలేదు. ఓ సర్‌ప్రైజ్ ఇచ్చి.. షాక్‌కు గురిచేశాడు. విషయం తెలిసిన ఆటగాళ్లు వద్దని చెప్పినా అతడు వినలేదు. దీంతో చేసేందేం లేక అతడికి ఓ హగ్ ఇచ్చి వెళ్లిపోయారు మన క్రికెటర్లు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా..? టీమిండియా ఆటగాళ్ల హోటల్ బిల్ చేశాడు. అది కూడా ఏకంగా రూ.6000.

మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు రోహిత్‌, పంత్‌, గిల్‌, సైని లంచ్‌ చేసేందుకు వెళ్లారు. వారిని అక్కడ చూసిన అభిమాని నవల్దీప్‌ సింగ్‌ తొలుత ఆశ్చర్యపోయాడు. వారిని ఎలాగైనా కలవాలనుకున్నాడు. అయితే అంతకుముందు వారికి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. సీక్రెట్‌గా వారు తిన్న పదార్థాలన్నింటికీ తాను బిల్ కట్టేశాడు. కొంత సేపటికి బిల్ కట్టేందుకు వచ్చిన ఆటగాళ్లకు వారి బిల్ చెల్లించేసినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు.

‘మీ టేబుల్‌ వెనుక కూర్చున్న నవల్‌దీప్‌ సింగ్‌ అనే వ్యక్తి బిల్లును కట్టేశార’ని పేర్కొన్నారు. దీంతో మన క్రికెటర్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు. తాము బిల్ కడతామని, వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కాని నవల్దీప్‌ ఒప్పుకోలేదు. అది తన తరపున గిఫ్ట్.. అని వద్దనవద్దని కోరాడు. దీంతో భారత ఆటగాళ్లు కూడా అతడిని హగ్ చేసుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు.

భారత్‌కు చెందిన నవల్‌దీప్‌ సింగ్‌ మెల్‌బోర్న్‌లో ఉంటున్నాడు. జనవరి 1న అతడు ఓ హోటల్‌కు వెళ్లగా రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్, నవదీప్‌ సైని, శుభ్‌మన్‌ గిల్‌ తన ముందు టేబుల్‌లో కూర్చున్నారు. అనుకోకుండా తనకి వచ్చిన ఈ అవకాశాన్ని జ్ఞాపకంగా మార్చుకోవాలని అనుకున్నాడు. సీక్రెట్‌గా మన క్రికెటర్ల బిల్లు చెల్లించేశాడు. దీనికి సంబంధించిన వీడియో, బిల్లును తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

‘‘నేను బిల్లును చెల్లించినట్లు వాళ్లకి తెలియదు. నా సూపర్‌స్టార్స్‌ కోసం ఆ మాత్రం చేయలేనా!’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు. దాన్ని రీట్వీట్ చేస్తూ..‘‘బిల్లు కట్టానని తెలుసుకున్న రోహిత్ నా వద్దకు వచ్చి.. ‘బ్రదర్‌.. డబ్బులు తీసుకో. మీరు చెల్లించడం బాగోద’ని అన్నాడు. ఆ తర్వాత పంత్‌ హగ్‌ చేసుకున్నాడు. అందరం కలిసి ఓ ఫొటో తీసుకున్నాం’’ అని పోస్ట్‌ చేశాడు.

 తాను భోజనం ఆర్డర్ చేసింది, టీమిండియా ఆటగాళ్లను చూసి వారి బిల్ చెల్లించింది, తరువాత ఏం జరిగింది..? ప్రతి విషయానిక సంబంధించి తన ట్విటర్‌లో అప్‌డేట్స్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండు టెస్టుల్లో ఒకటి ఆసీస్, మరొకటి భారత్ గెలిచి సరిసమానంగా ఉన్నాయి. ఇక 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి భారత్ పై చేయి సాధిస్తుందేమో చూడాలి.
" style="height: 587px;">

" style="height: 242px;">




విలన్ గా సత్యదేవ్ చిరంజీవిని మెప్పించగలడా ?

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>