MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-devc0719595-6540-473f-bd2d-0f6e599f99b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-devc0719595-6540-473f-bd2d-0f6e599f99b3-415x250-IndiaHerald.jpgఅదేంటి మెగా ఫ్యాన్స్ కి కళ్యాణ్ దేవ్ ఊరట నివ్వడం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఈ మొత్తం కధనం చదవాల్సిందే. విషయం ఏంటంటే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ ‘విజేత’ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయిందనుకోండి అది వేరే విషయం. కొంతకాలం క్రితమే ఆయన ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమాను ప్రారంభించారు. లాక్‌డౌన్ ముగిశాక షూటింగ్ కూడా జరుపుకుని ఇప్పుడు రిలీజ్ కు కూడా రెడీ అయింది. అయితే ఆయన అశ్వత్థామ దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో కిన్నెరసాని అనే మరో సినిమా కూడా చtollywood;chiranjeevi;kalyaan dhev;kalyan;ramana;ravi anchor;teja;tollywood;cinema;rajani kanth;vijay kumar naidu;super machi;winnerహమ్మయ్య.. మెగా ఫ్యాన్స్ టెన్షన్ తీర్చిన కళ్యాణ్ దేవ్హమ్మయ్య.. మెగా ఫ్యాన్స్ టెన్షన్ తీర్చిన కళ్యాణ్ దేవ్tollywood;chiranjeevi;kalyaan dhev;kalyan;ramana;ravi anchor;teja;tollywood;cinema;rajani kanth;vijay kumar naidu;super machi;winnerSat, 02 Jan 2021 08:02:42 GMTకళ్యాణ్ దేవ్ ఊరట నివ్వడం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఈ మొత్తం కధనం చదవాల్సిందే. విషయం ఏంటంటే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ ‘విజేత’ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయిందనుకోండి అది వేరే విషయం. కొంతకాలం క్రితమే ఆయన ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమాను ప్రారంభించారు. లాక్‌డౌన్ ముగిశాక షూటింగ్ కూడా జరుపుకుని ఇప్పుడు రిలీజ్ కు కూడా రెడీ అయింది. అయితే ఆయన అశ్వత్థామ దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో కిన్నెరసాని అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి అయ్యాక ఆగిపోయిందని ప్రచారం జరిగింది.

ఫస్ట్ షెడ్యూల్ మదనపల్లెలో పూర్తి చేయగా ఆ రషెష్‌ చూసుకున్నాక సినిమా ఆపేయడమే బెటర్‌ అని నిర్మాతలు భావించి సినిమా ఆపేశారని టాక్ వినిపించింది.  అయితే ఆ ప్రచారాన్ని ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్జ్ రిలీజ్ చేసి బ్రేకులు వేసింది సినిమా యూనిట్.  నూత‌న సంవ‌త్సరం సంద‌ర్భంగా 'కిన్నెర‌సాని' చిత్రం బృందం శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ గ్లిమ్స్‌ ని విడుదల చేసింది. ఈ గ్లిమ్స్‌ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

అలా మొత్తం మీద తమ సినిమా ఆగలేదని ఇలా చెప్పుకొచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమాని రామ్‌ తాళ్లూరి సారథ్యంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మిస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో పాటు శుభమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి 'కల్కి' చిత్రానికి కధ అందించిన సాయితేజ్ స్టోరీ అందించారు. అలానే ఛ‌లో, భీష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో సినిమా మీద అంచనాలు అయితే పెరుగుతున్నాయి.


గుడ్ న్యూస్.. చదువు మధ్యలో ఆపేసిన వారికి ఉద్యోగాలు..?

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>