PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpgయూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. భారత్‌-యూకే మధ్య విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. దీంతో ఈ నెల 8వ తేదీ నుంచి భారత్‌-యూకే మధ్య విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షరుతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ వెల్లడించారు. ఈ నెల 23 వరకు వారానికి 15 విమాన సర్వీసులకు మాత్రమే కేంద్రం అనుమతి తెలిపింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్corona;puri jagannadh;mumbai;delhi;minister;central government;coronavirusవిమాన ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్రం ఏం చెప్పిందో తెలుసా..?విమాన ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్రం ఏం చెప్పిందో తెలుసా..?corona;puri jagannadh;mumbai;delhi;minister;central government;coronavirusSat, 02 Jan 2021 09:30:47 GMTకేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. భారత్‌-యూకే మధ్య విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. దీంతో ఈ నెల 8వ తేదీ నుంచి భారత్‌-యూకే మధ్య విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షరుతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ వెల్లడించారు.  ఈ నెల 23 వరకు వారానికి 15 విమాన సర్వీసులకు మాత్రమే కేంద్రం అనుమతి తెలిపింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి మాత్రమే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి.



ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానాయనశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వెల్లడించారు. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్‌ విజృంభనతో ఇరుదేశాల మధ్య విమాన రాకపోకలపై కేంద్ర నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా కొత్తరకం ఆందోళనల నేపథ్యంలో భారత్‌-బ్రిటన్‌ల మధ్య విమానాల రాకపోకలు మరికొంతకాలం నిలిచిపోయే అవకాశాలున్నాయ‌ని విమాన‌యాన సంస్థ‌లు భావిస్తున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వాస్త‌వానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి ఐదు రోజుల క్రితం తాత్క‌లిక నిషేధం మరికొంత‌కాలం పాటు కొన‌సాగుతుంద‌న్న అభిప్రాయాన్నే‌ సూచనప్రాయంగా తెలియజేశారు.


‘బ్రిటన్‌కు విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు మరికొంత కాలం ఉండవచ్చని అనుకొంటున్నా. అయితే ఈ పొడిగింపు సుదీర్ఘకాలం లేదా నిరవధికంగా ఉండకపోవచ్చు’ అంటూ ఆయ‌న వ్యాఖ్య‌నించారు.   జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్ బ్రిటన్‌లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు యుకెకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. భారత ప్రభుత్వం కూడా గ‌త నెల‌ 23వ తేదీ అర్ధరాత్రినుంచి 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను రద్దు చేసింది. తాజాగా 8త‌ర్వాత నుంచి పునరుద్ధ‌రించాల‌ని నిర్ణ‌యించింది.  బ్రిటన్‌నుంచి భారత్‌కు చేరకున్న వారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించనుంది. ఇప్ప‌టికే ఆ విధానాన‌ని కొన‌సాగిస్తోంది కూడా.




ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>