PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-minister-appalaraju-domination-in-sreekakulam016206fc-7a27-48e0-bb14-53a6073f1893-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-minister-appalaraju-domination-in-sreekakulam016206fc-7a27-48e0-bb14-53a6073f1893-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం జిల్లాలో యువ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు దూకుడు ఎక్కువ‌గా ఉందా? వైసీపీ నేత‌ల‌కు ఇది మింగుడు ప‌డ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నాయి జిల్లా రాజ‌కీయ వ‌ర్గాలు. ముఖ్యంగా టీడీపీ నేతల ‌కు చెక్ పెట్టే విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, కృష్ణ‌దాస్ స‌హా ప‌లువురు నాయ‌కులు దూకుడుగా ముందుకు సాగ‌లేకపోయారు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. కుటుంబ సంబంధాలు.. ఇత‌ర ఈక్వేషన్స్ కార‌ణంగా నాయ‌కులు ముందుకు సాగ‌లేక‌పోయారు. అయితే.. ఇప్పుడు సీదిరి మాత్రం దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ysrcp;view;poorna;district;minister;cheque;tdp;yuva;ycp;dookudu;partyవైసీపీ మంత్రి దూకుడుతో వాళ్లంతా డ‌మ్మీలేనా..!వైసీపీ మంత్రి దూకుడుతో వాళ్లంతా డ‌మ్మీలేనా..!ysrcp;view;poorna;district;minister;cheque;tdp;yuva;ycp;dookudu;partySat, 02 Jan 2021 04:00:00 GMTయువ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు దూకుడు ఎక్కువ‌గా ఉందా?  వైసీపీ నేత‌ల‌కు ఇది మింగుడు ప‌డ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నాయి జిల్లా రాజ‌కీయ వ‌ర్గాలు. ముఖ్యంగా టీడీపీ నేతల ‌కు చెక్ పెట్టే విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, కృష్ణ‌దాస్ స‌హా ప‌లువురు నాయ‌కులు దూకుడుగా ముందుకు సాగ‌లేకపోయారు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. కుటుంబ సంబంధాలు.. ఇత‌ర ఈక్వేషన్స్ కార‌ణంగా నాయ‌కులు ముందుకు సాగ‌లేక‌పోయారు. అయితే.. ఇప్పుడు సీదిరి మాత్రం దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌లాస‌లో గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హాన్ని తీసేస్తామ‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న వెనుక రాజ‌కీ య వ్యూహం జోరుగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇది అటు టీడీపీని టార్గెట్ చేయ‌డంతోపాటు, ఇటు వైసీపీలో త‌న హ‌వాను పెంచుకునేందుకు కూడా సీదిరి వేసిన ప్లాన్‌గా చెబుతున్నారు. గౌతు ల‌చ్చ‌న్న విగ్‌ేహం తీసేస్తామ‌న‌డంతో టీడీపీ నాయ‌కులు ఏక‌మ‌య్యారు. వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో మంత్రిపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నా.. కొంద‌రు నాయ‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కౌంట‌ర్ ఇవ్వ‌డం లేద‌ని వైసీపీ అధినేత వ‌ర‌కు కంప్లెయింట్లు వెళ్లాయి.

పోనీ.. సీదిరి త‌ర‌ఫున మాట్లాడ‌దామంటే.. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన నాయ‌కుడికి మ‌ద్ద‌తుగా నిలిస్తే.. ఇప్ప టి వ‌ర‌కు తాము సాదించిన పొలిటిక‌ల్ హ‌వా అంతా.. ఏమైన‌ట్టు? అనే ప్ర‌శ్న ధ‌ర్మాన వ‌ర్గంలో ఆలోచ‌న ‌రేకెత్తిస్తోంది. ఇది రెండు ప‌క్క‌లా ధ‌ర్మాన ఫ్యామిలీకి కూడా ఇబ్బందిగానే ఉంది. మ‌ద్ద‌తిస్తే.. గౌతు ల‌చ్చ‌న్న వంటి నాయ‌కుడికి వ్య‌తిరేకంగా ఉన్నారా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పుకొవాలి. మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే.. పార్టీ క‌న్నా కూడా కుటుంబ సంబంధాలు ఎక్కువ‌, ప‌రోక్షంగా టీడీపీకి సాయం చేస్తున్నార‌నే ప్ర‌చారం పార్టీలో వ్య‌క్త‌మ‌వుతోంది. వెర‌సి .. సీదిరి వేసిన ప్లాన్‌లో ధ‌ర్మాన ఫ్యామిలీ అడ్డంగా బుక్క‌యింది. మ‌రోవైపు.. స్పీక‌ర్ త‌మ్మినేని కూడా ఈ విష‌యంలో మౌనం పాటిస్తున్నారు.

ఎటూ చెప్ప‌లేక‌.. ఆయ‌న మంత్రి సీదిరి చేసిన వ్యాఖ్య‌లు త‌న దృష్టికి రాలేద‌ని.. ఆలోచించి మాట్లాడ‌తాన‌ని త‌ప్పుకొన్నార‌ని టాక్‌. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. వ‌చ్చే మూడేళ్ల‌లో జిల్లాపై పూర్తి ప‌ట్టు సంపాదించుకోవ‌డం సీదిరికి చాలా తేలిక అవుతుంద‌ని అంటున్నారు. పైగా ఆయ‌న ఏం చేసినా.. పార్టీ అధినేత జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తుండ‌డంతో పార్టీ వైపు నుంచి ఆయ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో సీదిరి శ‌కం ప్రారంభం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ ఎమ్మెల్యేకు ప్లస్...

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>