BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/pigmentation19dfae08-06ba-43bf-b975-a608319faba6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/pigmentation19dfae08-06ba-43bf-b975-a608319faba6-415x250-IndiaHerald.jpgపిగ్మెంటేషన్ అనగా చర్మం మీద కొన్ని భాగాలు నల్లగా మారడం. కొంతమంది ఎంత అందంగా,తెల్లగా ఉన్నప్పటికీ ముఖం మీద ఏదో తెలియని మచ్చలు ఏర్పడతాయి. వీటివల్ల అందవిహీనంగా కనిపిస్తుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల మందులను క్రీమ్స్ ను తెచ్చి వాడుతుంటారు. ఇక ఎండాకాలంలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కువగా మహిళలలో సున్నిత చర్మం కలిగిన వారిలో ఈ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఏర్పడుతుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మన చర్మం మీద పడినప్పుడు వాటిని తట్టుకునే శక్తి చర్మానికి ఉండదు. pigmentation;nithya new;surya sivakumar;tara;mandula;shaktiపిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారా?పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారా?pigmentation;nithya new;surya sivakumar;tara;mandula;shaktiSat, 02 Jan 2021 16:45:00 GMTపిగ్మెంటేషన్ అనగా చర్మం మీద కొన్ని భాగాలు నల్లగా మారడం. కొంతమంది ఎంత అందంగా,తెల్లగా ఉన్నప్పటికీ ముఖం మీద ఏదో తెలియని మచ్చలు ఏర్పడతాయి. వీటివల్ల అందవిహీనంగా కనిపిస్తుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల మందులను క్రీమ్స్ ను తెచ్చి వాడుతుంటారు. ఇక ఎండాకాలంలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కువగా మహిళలలో  సున్నిత చర్మం కలిగిన వారిలో ఈ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఏర్పడుతుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మన చర్మం మీద పడినప్పుడు వాటిని తట్టుకునే శక్తి చర్మానికి ఉండదు.  అలాంటప్పుడు ఈ ఎండ పడిన చర్మ భాగాలన్నీ పిగ్మెంటేషన్ కు గురవుతాయి.


హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు,దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మందుల వల్ల చర్మం నల్లబడుతుంది.జుట్టుకు తరచూ కలర్ వేసే వారిలో కూడా చర్మం నల్లబడుతుంది.ఇలాంటి సమస్యలు ఏర్పడకముందే తగు జాగ్రత్తలు తీసుకుంటే, పిగ్మెంటేషన్ నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

క్యారెట్, క్యాబేజీ, ఓట్స్ సమపాళ్ళలో కొద్దికొద్దిగా తీసుకొని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఆఫ్ టేబుల్ స్పూన్ మీగడ, ఆఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని నల్ల మచ్చలు ఉన్న చోట వృత్తాకారంలో మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం వలన త్వరలోనే మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

నల్ల ద్రాక్ష గుజ్జుకి,తేనె కలిపి రోజూ ముఖానికి మర్దనా చేయాలి. అరగంట ఆగి చల్లని నీటితో కడిగేసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది.బయటకు వెళ్ళడానికి ముందు ప్రతిరోజూ సన్ స్క్రీన్ లోషన్ వాడితే మచ్చలు నుండి విముక్తి పొందుతారు. నిత్యం మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అంతేకాకుండా తాజా పండ్లు, కూరగాయలు, పానీయాలు సేవిస్తూ ఉండాలి. పిగ్మెంటేషన్ కారణంగా బాధపడుతున్నవారు ఇక్కడ పేర్కొన్న చిట్కాలను పాటించి మీ చర్మాన్ని కాంతివంతంగా తయారుచేసుకోండి.

 


ఘటన వెనుక స్వార్ధపూరిత శక్తులు ఉన్నాయి: మంత్రి బొత్స సత్యన్నారాయణ

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>