PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-chief-achhemnaidu-fire-on-jagan-vijaysai-reddy04c86c97-7cb2-49c7-bf01-811cde4348d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-chief-achhemnaidu-fire-on-jagan-vijaysai-reddy04c86c97-7cb2-49c7-bf01-811cde4348d5-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెమనాయుడు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో గత 19 నెలలుగా రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని ఆయన మండిపడ్డారు. 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయనే పొగరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేశారని దుయ్యబట్టారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని అచ్చెమనాయుడు ఆరోపించారు.achhem naidu;deva;ramu;jagan;andhra pradesh;mp;uttarandhra;chief minister;assembly;tdp;local language;ycp;rama tirtha;hindus;reddy;partyఉత్తరాంధ్రను దొంగకు అప్పగించారు!ఉత్తరాంధ్రను దొంగకు అప్పగించారు!achhem naidu;deva;ramu;jagan;andhra pradesh;mp;uttarandhra;chief minister;assembly;tdp;local language;ycp;rama tirtha;hindus;reddy;partySat, 02 Jan 2021 21:32:56 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఇరు పార్టీల నేతల వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఆలయాలపై దాడులకు సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య చిన్నపాటి యుద్ధమే సాగుతోంది. రామతీర్థం ఆలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం ఘటన రెండు పార్టీల మధ్య మంటలు రాజేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెమనాయుడు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో గత 19 నెలలుగా రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని ఆయన మండిపడ్డారు. 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయనే పొగరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేశారని దుయ్యబట్టారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని అచ్చెమనాయుడు ఆరోపించారు.

      ఉత్తరాంధ్ర వ్యవహారాలను ఒక దొంగకు అప్పగించారంటూ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అచ్చెమనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఎందరో వైసీపీ నేతలు ఉండగా... బయటి వ్యక్తికి బాధ్యతలను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నాలుగు రోజుల తర్వాత మీకు దేవుడు గుర్తొచ్చాడా? అని మండిపడ్డారు. ఒక ప్రణాళిక ప్రకారమే విజయసాయిరెడ్డి  రామతీర్థంకు వచ్చారని అచ్చెన్న ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లో మత విధ్వేషాలు రగిల్చి ఓట్లు దండుకోవాలని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు.

        హిందువులన్నా, హిందూ దేవాలయాలన్నా సీఎం జగన్ కు ద్వేషమని అచ్చెన్నాయుడు అన్నారు. ఇన్ని ఘటనలు జరిగినా సీఎం, డీజీపీ స్పందించడం లేదని మండిపడ్డారు. వైసీపీ వాళ్లు చేసిన దుర్మార్గాలను తమ పార్టీ నేతలకు ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఏపీ అరాచకాలకు అడ్డాగా మారిపోయిందని అచ్చెమనాయుడు ఆరోపించారు.





మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>