PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpg ఆయ‌న కూడా స్పందించ‌క త‌ప్ప‌లేదు. సుబ్బ‌య్య హ‌త్య విష‌యంలో త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు. లోకేష్ కు స‌వాల్ చేయ‌డంతో పాటు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. తాను ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాన‌ని.. ఉప ఎన్నిక‌ల్లో నందం సుబ్బ‌య్య హ‌త్యే ప్ర‌ధాన ఎజెండాగా ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని... ఎవ‌రు గెలుస్తారో ? చూసుకుందామ‌న్నారు. తాను ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పేరును, ప్ర‌భుత్వం, సంక్షేమ ప‌థ‌కాల పేరును కూడా వాడుకోన‌ని... కేవ‌లం సుబ్బ‌య్య హ‌త్యే ఎజెండాగా ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని స‌వాల్ lokesh;lokesh;nara lokesh;రాజీనామా;district;police;mla;minister;fort;proddatur;letter;tdp;ycp;lokesh kanagarajలోకేష్ మ‌రో ఓట‌మికి రెడీ కావాల్సిందే... అక్క‌డ కూడా మంగ‌ళ‌గిరి సీన్ రిపీట్‌...!లోకేష్ మ‌రో ఓట‌మికి రెడీ కావాల్సిందే... అక్క‌డ కూడా మంగ‌ళ‌గిరి సీన్ రిపీట్‌...!lokesh;lokesh;nara lokesh;రాజీనామా;district;police;mla;minister;fort;proddatur;letter;tdp;ycp;lokesh kanagarajSat, 02 Jan 2021 09:46:32 GMTటీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రొద్దుటూరు సంఘ‌ట‌న‌లో క్రియేట్ చేసిన సీన్‌తో కాస్త హైప్ తెచ్చుకున్నారు. లోకేష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మాత్రం స్పీడ్‌తో మాట్లాడిన దాఖ‌లాలు లేవు. ప్రొద్దుటూరులో మాత్రం అక్క‌డ మ‌కాం వేసి ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న బావ‌మ‌రిదిపై కేసు న‌మోదు చేసే వ‌ర‌కు క‌ద‌ల‌న‌ని భీష్మించ‌డం.. వాళ్ల‌పై కేసులు న‌మోదు కావ‌డంతో లోకేష్‌కు కాస్తో కూస్తో హైప్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే లోకేష్‌కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. మూడు రోజుల క్రితం టీడీపీ జిల్లా అధికార ప్ర‌తినిధి నందం సుబ్బ‌య్య హ‌త్య‌కు సంబంధించి రాచ‌మ‌ల్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో పాటు పోలీసులు సైతం ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే రాచ‌మ‌ల్లుపై తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న కూడా స్పందించ‌క త‌ప్ప‌లేదు. సుబ్బ‌య్య హ‌త్య విష‌యంలో త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు. లోకేష్ కు స‌వాల్ చేయ‌డంతో పాటు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. తాను ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాన‌ని.. ఉప ఎన్నిక‌ల్లో నందం సుబ్బ‌య్య హ‌త్యే ప్ర‌ధాన ఎజెండాగా ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని... ఎవ‌రు గెలుస్తారో ?  చూసుకుందామ‌న్నారు.

తాను ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పేరును, ప్ర‌భుత్వం, సంక్షేమ ప‌థ‌కాల పేరును కూడా వాడుకోన‌ని... కేవ‌లం సుబ్బ‌య్య హ‌త్యే ఎజెండాగా ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని స‌వాల్ చేశారు. లోకేష్ ఇక్క‌డ పోటీ చేసుకోవ‌చ్చ‌ని.. తాను ఓడితే మాత్రం రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని కూడా చెప్పారు. మ‌రి లోకేష్ ఈ స‌వాల్ స్వీక‌రించి ఇక్క‌డ పోటీ చేస్తారా ? అంటే డౌటే. మంగ‌ళ‌గిరి లాంటి పార్టీకి ప‌ట్టుండి, రాజ‌ధాని ఏర్పాటు చేసిన చోటే లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయాడు.

క‌డ‌ప జిల్లా, పైగా వైసీపీ కంచుకోట అయిన ప్రొద్దుటూరి లాంటి చోట్ల లోకేష్ పొర‌పాటుగా పోటీ చేస్తే మ‌రో ప‌రాజ‌యానికి రెడీ కావాల్సిందే అన‌డంలో డౌట్ అక్క‌ర్లేదు. అక్క‌డ కూడా మంగ‌ళ‌గిరి ఫ‌లితం రిపీట్ కావాల్సిందే.!




నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీకి అరుదైన గౌరవం..!?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>