MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani008af9b6-59de-46b0-bcb5-521ddd5ff0c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani008af9b6-59de-46b0-bcb5-521ddd5ff0c8-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు నాని. అష్టాచమ్మా సినిమాతో తెరంగ్రేటం చేసిన నాని వరస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోలలో ఒక్కరిగా చేరారు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది.nani;nani;dadasaheb phalke;atreya;nageshwara rao akkineni;rashmika mandanna;thaman s;korea, south;pithe;2019;cinema;ala venkatapuram lo;saaho;jersey;central government;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramనాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీకి అరుదైన గౌరవం..!?నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీకి అరుదైన గౌరవం..!?nani;nani;dadasaheb phalke;atreya;nageshwara rao akkineni;rashmika mandanna;thaman s;korea, south;pithe;2019;cinema;ala venkatapuram lo;saaho;jersey;central government;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramSat, 02 Jan 2021 10:00:00 GMTన్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు నాని. అష్టాచమ్మా సినిమాతో తెరంగ్రేటం చేసిన నాని వరస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోలలో ఒక్కరిగా చేరారు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. గత కొన్నేళ్లుగా భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే కుటుంబ సభ్యులు భారతీయ భాషల్లో వచ్చిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం గత 50 ఏళ్లుగా ఆయన పేరుతో చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలు అందించిన వారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తున్న సంగతి తెలిసిందే కదా. దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ తెలుగు కేటగిరిలో 2019కి సంబంధించిన అవార్డులను ప్రకటించారు. అందులో  ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ సినిమా అవార్డు కైవసం చేసుకుంది. అయితే  ఉత్తమ నటుడి అవార్డును నవీన్ పోలీశెట్టి దక్కించుకున్నాడు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాకు గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. డియర్ కామ్రేడ్‌లో నటనకు రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికైంది.

అయితే భారీ బడ్జెట్‌‌తో ‘సాహో’ మూవీని తెరకెక్కించిన సుజీత్ ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాకు మంచి మ్యూజిక్ అందించిన థమన్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది. మొత్తంగా 2019 అవార్డులో భాగంగా 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ఎలా ఇస్తారని కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే.. సెన్సార్ అయిన డేట్ ప్రకారం ఎంట్రీస్ పంపితే.. ప్రభుత్వం అవార్డుల ఇవ్వడం కామన్. కానీ ఓ ప్రైవేటు సంస్థ ఇలా 2019 అవార్డులు అని చెప్పి 2020లో విడుదలైన సినిమాకు అవార్డు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.




బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>