MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/festival11edfbd6-99a7-4470-b8e2-baa8257ab0a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/festival11edfbd6-99a7-4470-b8e2-baa8257ab0a8-415x250-IndiaHerald.jpg 2020 వ సంవత్సరం పూర్తయి నేటి నుంచి 2021 వ సంవత్సరంలోకి అందరం అడుగుపెట్టాం. మరోవైపు కరోనా కారణంగా ఇటీవల విధించిన లాక్ డౌన్ మెల్లగా విడతలవారీగా సడలిసస్తూ వస్తున్న ప్రభుత్వం కొన్నాళ్ళ క్రితం సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇటీవల థియేటర్స్ తెరుచుకునేందుకు కూడా అనుమతులు జారీ చేసింది. ఎట్టకేలకు థియేటర్స్ తెరుచుకోవడంతో కొద్ది రోజుల క్రితం తొలి సినిమాగా రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకాభిమానుల ఆదరణతో ప్రస్తుతం ముందు కొనసాగుతుంది.tollywood;pongal movies 2021;ravi;lokesh;gopichand;shruti;shruti haasan;amrutha;bellamkonda sai sreenivas;kranthi;kranti;malavika new;mani sharma;nabha natesh;raj;raja;ram pothineni;ravi anchor;ravi teja;santhosh;santosh srinivas;srinivas;sruthi;tiru;vijay;makar sakranti;cinema;sankranthi;january;tirupati;tamil;2020;audience;blockbuster hit;remake;war;jaggery;heroine;success;joseph vijay;lokesh kanagaraj;santhossh jagarlapudi;solo bathuke so better;mass;master;adhurs;kishore tirumala;krack;redప్చ్ .... కొంపతీసి వార్ వన్ సైడ్ అవ్వదు కదా ......??ప్చ్ .... కొంపతీసి వార్ వన్ సైడ్ అవ్వదు కదా ......??tollywood;pongal movies 2021;ravi;lokesh;gopichand;shruti;shruti haasan;amrutha;bellamkonda sai sreenivas;kranthi;kranti;malavika new;mani sharma;nabha natesh;raj;raja;ram pothineni;ravi anchor;ravi teja;santhosh;santosh srinivas;srinivas;sruthi;tiru;vijay;makar sakranti;cinema;sankranthi;january;tirupati;tamil;2020;audience;blockbuster hit;remake;war;jaggery;heroine;success;joseph vijay;lokesh kanagaraj;santhossh jagarlapudi;solo bathuke so better;mass;master;adhurs;kishore tirumala;krack;redSat, 02 Jan 2021 08:00:00 GMT2020 వ సంవత్సరం పూర్తయి నేటి నుంచి 2021 వ సంవత్సరంలోకి అందరం అడుగుపెట్టాం. మరోవైపు కరోనా కారణంగా ఇటీవల విధించిన లాక్ డౌన్ మెల్లగా విడతలవారీగా సడలిసస్తూ వస్తున్న ప్రభుత్వం కొన్నాళ్ళ క్రితం సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇటీవల థియేటర్స్ తెరుచుకునేందుకు కూడా అనుమతులు జారీ చేసింది. ఎట్టకేలకు థియేటర్స్ తెరుచుకోవడంతో కొద్ది రోజుల క్రితం తొలి సినిమాగా రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ మంచి విజయాన్ని అందుకొని  ప్రేక్షకాభిమానుల ఆదరణతో ప్రస్తుతం ముందు కొనసాగుతుంది.

మరోవైపు సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా వాటిలో మాస్ రాజా రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ క్రాక్. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా పలు ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నిన్న న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయి మూవీ పై మంచి అంచనాలే క్రియేట్ చేసింది. ఇటీవల కెరీర్ పరంగా వరుసగా పరాజయాలు అందుకుంటున్న మాస్ రాజా కెరీర్ కి జనవరి 14న రిలీజ్ కానున్న ఈ మూవీ మంచి బ్రేక్ అవ్వడం ఖాయమని క్రాక్ యూనిట్ అభిప్రాయపడుతొంది. మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెడ్. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన తడం మూవీకి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా స్రవంతి రవి కిషోర్ ఈ మూవీను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మాళవిక శర్మ, నివేతా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్ అలానే ట్రైలర్ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక జనవరి 14న ఈ సినిమా రిలీజ్ తర్వాత తప్పకుండా సూపర్ హిట్ కొట్టి రామ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ నమోదు చేయడం ఖాయమని రెడ్ మూవీ యూనిట్ అభిప్రాయపడుతోంది. ఇక వీటితో పాటు యువనటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా అల్లుడు అదుర్స్. నభా నటేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 15 రిలీజ్ కానుంది. ప్రస్తుతం వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో అత్యద్భుత నటనకు కనబరిచాడని అలానే అతి త్వరలో రిలీజ్ కాబోయే సినిమా థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ మూవీపై అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేయడం ఖాయమని ఇక రిలీజ్ అనంతరం మూవీ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాస్టర్. మంచి మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్లో రిలీజ్ అయి పలు సంచలనాలను నమోదు చేయడంతోపాటు సినిమాపై విజయ్ అభిమానులు అలానే ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. అటు తమిళంలో పాటు తెలుగు సహా పలు ఇతర భాషల్లో ఏకకాలంలో జనవరి 13న రిలీజ్ కానున్న ఈ మూవీపై తెలుగు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి గాను అనిరుద్ అందించిన సాంగ్స్ మంచి ఆదరణ అందుకోవడంతో తప్పకుండా మాస్టర్ సినిమా కూడా సక్సెస్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవడంతో ఈ ఏడాది వీటిలో ఏది సక్సెస్ అవుతుంది అనేది ప్రేక్షకాభిమానుల్లో కొంత ఆసక్తికరంగా మారింది. అయితే వీటిలో అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయా, లేక కొన్ని సక్సెస్ అవుతాయా లేక ఏదైనా ఒక్కటి మాత్రమే బాగా సక్సెస్ సాధించి వార్ వన్ సైడ్ అవుతుందా అనేది తెలియాలంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు.....!!




తృణ‌మూల్ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు... మ‌ళ్లీ ఏం జరిగిందో తెలుసా..

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>