PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ganta-srinivas-raoe6bc4599-3501-4853-8617-85a02cc8927c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ganta-srinivas-raoe6bc4599-3501-4853-8617-85a02cc8927c-415x250-IndiaHerald.jpgరాజ‌కీయ భ‌విష్య‌త్తును కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పారు. ఇక సంతృప్తి అనేది రిలేటివ్ ట‌ర్మ్‌.. టీడీపీలో తాను సంతృప్తితో ఉన్నానా ? లేదా ? అన్న‌ది కూడా త్వ‌ర‌లోనే చెపుతాన‌ని గంటా చెప్పారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు న‌లుగురు బ‌య‌ట‌కు వెళ్ల‌డంపై కూడా ఆయ‌న స్పందించారు. ఆ అసంతృప్తి అనేది వాళ్ల వ్య‌క్తిగ‌త విష‌యం అని కూడా గంటా చెప్పారు. ఇక తాను పార్టీ మారాల‌ని అనుకుంటే.. అంద‌రితోనూ చ‌ర్చించే ఆ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని.. ర‌హ‌స్యంగా రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఎప్పుడూ ఉండ‌ద‌ని చెప్పారు. ganta srinivas rao;srinivas;telugu desam party;telugu;vishakapatnam;mla;minister;letter;tdp;partyగంటా టీడీపీలో ఉండ‌రా... ఆ మాట‌కు అర్థం అదేనా...?గంటా టీడీపీలో ఉండ‌రా... ఆ మాట‌కు అర్థం అదేనా...?ganta srinivas rao;srinivas;telugu desam party;telugu;vishakapatnam;mla;minister;letter;tdp;partySat, 02 Jan 2021 11:02:10 GMTతెలుగుదేశం పార్టీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పార్టీ మారతారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. గంటా ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్నా ఆయ‌న చుట్టూ జ‌రుగుతున్న ప్రచారం మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా ఆయ‌న త‌న పార్టీ మార్పుపై జ‌రుగుతోన్న ప్ర‌చారంపై స్పందించారు. తాను ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యేనే అని... ఎన్నిక‌ల‌కు ముందు.. గెలిచిన త‌ర్వాత కూడా తాను పార్టీ మార‌తాన‌న్న ప్ర‌చారం జ‌రిగింద‌ని... త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తాన‌ని గంటా చెప్పారు.

టైం వ‌చ్చిన‌ప్పుడు అన్ని డౌట్ల‌ను క్లారిఫై చేస్తాన‌ని చెప్పిన గంటా, త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పారు. ఇక సంతృప్తి అనేది రిలేటివ్ ట‌ర్మ్‌.. టీడీపీలో తాను సంతృప్తితో ఉన్నానా ?  లేదా ? అన్న‌ది కూడా త్వ‌ర‌లోనే చెపుతాన‌ని గంటా చెప్పారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు న‌లుగురు బ‌య‌ట‌కు వెళ్ల‌డంపై కూడా ఆయ‌న స్పందించారు. ఆ అసంతృప్తి అనేది వాళ్ల వ్య‌క్తిగ‌త విష‌యం అని కూడా గంటా చెప్పారు.

ఇక తాను పార్టీ మారాల‌ని అనుకుంటే.. అంద‌రితోనూ చ‌ర్చించే ఆ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని.. ర‌హ‌స్యంగా రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఎప్పుడూ ఉండ‌ద‌ని చెప్పారు. గంటా చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే ఆయ‌న టీడీపీలో మ‌న‌స్ఫూర్తిగా ఇమ‌డ‌లేక‌పోతున్నార‌న్న‌ది క్లారిటీగా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ఆయ‌నకు పార్టీలో గుర్తింపు కూడా లేద‌ని తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌.

అధిష్టానం వెర్ష‌న్ మ‌రోలా ఉంది. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటోన్న గంటా అనేక సందేహాల‌కు ఎందుకు తావిస్తున్నార‌న్న‌దే అధిష్టానం ఆలోచ‌న‌. ఈ ప‌రిణామాల‌తో గంటా టీడీపీలో ఎంత కాలం ఉంటారో ?  కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి అయితే ఉంది. ఇక గంటా ముందుగా బీజేపీలోకి వెళ‌తార‌ని.. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ‌తార‌ని ప్ర‌చారం అయితే ఆగ‌డం లేదు. మ‌రి ఆయ‌న పొలిటిక‌ల్ రూటు ?  ఎలా ఉందో చూడాలి. 


పార్టీ మార్పుపై తుమ్మ‌ల సంచ‌ల‌నం... స‌త్తుప‌ల్లిలో భారీ స‌మావేశం..!

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>