PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jai-vijayasayi-annatlannu-budda-matalu28d49b16-89f7-4db9-8bea-0dc10e7b5e3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jai-vijayasayi-annatlannu-budda-matalu28d49b16-89f7-4db9-8bea-0dc10e7b5e3e-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా కూడా ఆయ‌న‌కు మంచి మార్కులే ఉన్నాయి. అంద‌రినీ క‌లుపుకొనిపోయే నాయ‌కుడిగా పేరుంది. పైగా చంద్ర‌బాబు ప‌ట్ల అమిత‌మైన గౌర‌వం ఆయ‌న సొంతం. సొంత పార్టీ నేత‌లైనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లైనా.. చంద్ర‌బాబుపై ఏమైనా అంటే.. ఖ‌స్సున లేచే మ‌న‌స్త‌త్వం ఆయ‌న సొంతం. ఇదే బుద్దా వెంక‌న్న రాజ‌కీయాల‌ను కీల‌క మ‌లుపు తిప్పింది. పార్టీలో ఎన‌లేని గుర్తింపును తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఉత్త‌రాంధ్ర పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్నారు. ఇటీవ‌లే చంద్ర బాబు ఆయ‌న‌కు buddha venkanna;nithya new;adinarayanareddy;backward classes;letter;service;tdp;buddha venkanna;partyబుద్దా దూకుడు.. ఉత్త‌రాంధ్ర టీడీపీ గాడిన ప‌డుతుందా..?బుద్దా దూకుడు.. ఉత్త‌రాంధ్ర టీడీపీ గాడిన ప‌డుతుందా..?buddha venkanna;nithya new;adinarayanareddy;backward classes;letter;service;tdp;buddha venkanna;partySat, 02 Jan 2021 11:35:55 GMTబుద్దా వెంక‌న్న‌. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన బుద్దా.. ఆది నుంచి కూడా ప‌ద‌వులు, పంప‌కాలు.. అనే మాట లేకుండా పార్టీ అభ్యున్న‌తి కోసం కృషి చేస్తున్నార‌న‌డంలో సందేహం లేదు. విజ‌య‌వాడ‌లో కీల‌క ప్రాజెక్టులువ‌చ్చేందుకు ఆయ‌న చేసిన కృషి ఫ‌లితంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌రించింది. అయితే.. కొంద‌రి మాదిరిగా ఈ ప‌ద‌విని అడ్డు పెట్టుకుని ఆయ‌న హ‌వా చ‌లాయించింది లేదు.

ఎమ్మెల్సీగా ఆయ‌న పార్టీకి మ‌రింత సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా కూడా ఆయ‌న‌కు మంచి మార్కులే ఉన్నాయి. అంద‌రినీ క‌లుపుకొనిపోయే నాయ‌కుడిగా పేరుంది. పైగా చంద్ర‌బాబు ప‌ట్ల అమిత‌మైన గౌర‌వం ఆయ‌న సొంతం. సొంత పార్టీ నేత‌లైనా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లైనా.. చంద్ర‌బాబుపై ఏమైనా అంటే.. ఖ‌స్సున లేచే మ‌న‌స్త‌త్వం ఆయ‌న సొంతం. ఇదే బుద్దా వెంక‌న్న రాజ‌కీయాల‌ను కీల‌క మ‌లుపు తిప్పింది. పార్టీలో ఎన‌లేని గుర్తింపును తీసుకువ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఆయ‌న ఉత్త‌రాంధ్ర పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్నారు. ఇటీవ‌లే చంద్ర బాబు ఆయ‌న‌కు ఈ కీల‌క ప‌ద‌వి అప్ప‌గించారు. వాస్త‌వానికి పాతిక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఐదుగు రు నేత‌ల‌ను నియ‌మించ‌గా.. బుద్దాకు ఉత్త‌రాంధ్ర‌లోని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను అప్ప‌గించారు. ఇత‌ర నేత‌ల సంగ‌తేమో కానీ.. బుద్దా మాత్రం.. వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టి స్తున్నారు. అక్క‌డే ఉంటున్నారు. ప్ర‌స్తుతం పార్టీకి ఒకింత ఇబ్బందిక‌రంగా ఉన్న ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు. ప్ర‌భుత్వంపై నిత్యం ఏదో ఒక కీల‌క విష‌యంతో దూసుకుపోతున్నా రు. చంద్ర‌బాబు ఇస్తున్న పిలుపు మేర‌కు ఆయ‌న స్పందిస్తున్నారు. అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. ఈగో మాటే లేకుండా అంద‌రితోనూ క‌లివిడిగా ఉంటున్నారు. ఇత‌ర నేత‌ల‌క‌న్నా కూడా ఎక్కువ‌గా పార్టీకి స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పార్టీకి బుద్దా అందివ‌చ్చిన నాయ‌కుడిగా అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.




కాలిఫోర్నియాలో 25వేల క‌రోనా మ‌ర‌ణాలు..వ‌ణికిపోతున్న జ‌నం..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>