PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan4c92032e-ffba-4179-a5db-ad1eb3dfc3af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan4c92032e-ffba-4179-a5db-ad1eb3dfc3af-415x250-IndiaHerald.jpgఏపీలో దేవాలయాలపై రాజకీయం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు వైసీపీ వాళ్ళే చేస్తున్నారని టీడీపీ, కాదు కాదు టీడీపీ నేతలే చేసి ఆ నెపం ప్రభుత్వం మీద నెట్టేయాలని చూస్తున్నారని వైసీపీ వాళ్ళు వాదించుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే ఆలయాలపై దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి. jagan;lokesh;ramu;tara;jagan;nara lokesh;sri venkateswara swamy;uttarandhra;tdp;pink;ycp;lokesh kanagaraj;buddha venkanna;simhadriటీడీపీ వర్సెస్ విజయసాయి: మధ్యలో జగన్‌ని లాగిన చినబాబు...టీడీపీ వర్సెస్ విజయసాయి: మధ్యలో జగన్‌ని లాగిన చినబాబు...jagan;lokesh;ramu;tara;jagan;nara lokesh;sri venkateswara swamy;uttarandhra;tdp;pink;ycp;lokesh kanagaraj;buddha venkanna;simhadriSat, 02 Jan 2021 00:00:00 GMTజగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు వైసీపీ వాళ్ళే చేస్తున్నారని టీడీపీ, కాదు కాదు టీడీపీ నేతలే చేసి ఆ నెపం ప్రభుత్వం మీద నెట్టేయాలని చూస్తున్నారని వైసీపీ వాళ్ళు వాదించుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అలాగే ఆలయాలపై దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేయగా, తూర్పు గోదావరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇక ఆలయాలపై దాడులు ఘటనలో నిందితులని కూడా పెద్దగా పట్టుకున్నట్లు కనబడలేదు. దీంతో టీడీపీ, వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉంది. జగన్ ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకమని, కావాలనే హిందూ దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

రామతీర్ధం ఘటనపై కూడా ఇలాంటి విమర్శలే చేశారు. దీంతో వైసీపీ కూడా కౌంటర్ ఎటాక్ చేస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న విజయసాయి, ఓ అడుగు ముందుకేసి, ఆలయాలపై దాడులు, చంద్రబాబు, నారా లోకేష్‌లు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పక్కగా టీడీపీ వాళ్లే చేశారని, అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి తాళాలు బద్దలగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

ఇలా ఆరోపించాక టీడీపీ వాళ్ళు ఏమి ఆగుతారు. వాళ్ళు కూడా కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో హిందూ అనే పదం లేకుండా చేయాలనే కుట్ర, ఉత్తరాంధ్ర నుంచే మొదలైందని,  140కు పైగా దేవాలయ పై దాడులు చేస్తే, ఒక్కరిని పట్టుకోలేదని, హిందూ ద్రోహులను పట్టుకోలేని చేత కాని మంద, లోకేష్ చేసాడు, చంద్రబాబు చేసాడు అని సొల్లు వాగుడు వాగుతున్నారని, గతంలో ఇలాగే పింక్ డైమెండ్ అని ఫేక్ కబురులు చెప్పారని, చివరకు ఏమైంది ?అని విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.

ఇక నారా లోకేష్ అయితే ఏకంగా జగన్‌నే దీనిలోకి లాగారు. తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని సింహాద్రి అప్పన గుడిలో ప్రమాణం చెయ్యడానికి తాను సిద్ధమని, అందుకు జగన్ సిద్ధమా అని లోకేష్ ప్రశ్నించారు. మొత్తానికైతే వైసీపీ-టీడీపీలు ఆలయాలపై బాగానే రాజకీయాలు చేస్తున్నాయి. కానీ ఇంతవరకు దాడులు చేసేవారిని పట్టుకోకపోవడం ఏంటి అనేది ఎవరికి అర్ధం కావడం లేదని జనం మాట్లాడుకుంటున్నారు.




తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>