PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/number-of-new-corona-cases-in-ap76e15edc-9c26-41c3-a957-4093c9f4424e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/number-of-new-corona-cases-in-ap76e15edc-9c26-41c3-a957-4093c9f4424e-415x250-IndiaHerald.jpgక‌రోనా రిక‌వ‌రీ రేటులో భార‌త్ ప్ర‌పంచ రికార్డు సృష్టిస్తోంది. ప్ర‌త్యేకంగా కోవిడ్‌కు ఎలాంటి చికిత్స లేకున్నా... ప్ర‌త్యామ్నాయ ప‌ద్ధ‌తుల ద్వారా క‌రోనా రోగులు గ‌ణ‌నీయ సంఖ్య‌లో కోలుకుంటున్నారు. దేశంలో రికవరీలు ఇప్పటికే 99 లక్షల మార్కును దాటి..కోటి దిశగా పయనిస్తున్నాయి. వరసగా 36వ రోజు కూడా రోజూవారీ పాజిటివ్ కేసులకంటే..రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా వివ‌రాల ప్రకారం.. శుక్రవారం 22,926 మంది వైరస్‌ నుంచి కోలుకోగా..ఇప్పటివరకు 99,06,387 మంది ఈ మహమ్మారిని జయింcorona;koti;kranthi;kranti;makar sakranti;sankranthi;central government;96క‌రోనా రిక‌వ‌రీలో ప్ర‌పంచ రికార్డు సృష్టించిన భార‌త్‌.... ఎలానో తెలుసా..?క‌రోనా రిక‌వ‌రీలో ప్ర‌పంచ రికార్డు సృష్టించిన భార‌త్‌.... ఎలానో తెలుసా..?corona;koti;kranthi;kranti;makar sakranti;sankranthi;central government;96Sat, 02 Jan 2021 11:34:34 GMTకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా వివ‌రాల ప్రకారం.. శుక్రవారం 22,926 మంది వైరస్‌ నుంచి కోలుకోగా..ఇప్పటివరకు 99,06,387 మంది ఈ మహమ్మారిని జయించారు. రికవరీ రేటు 96.12శాతానికి పెరిగింది.


ఇక, కొత్త ఏడాదిలో మొదటిసారి 20 వేలకు దిగువన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 8,29,964 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..19,079 మందికి వైరస్ సోకినట్లు వెల్లడైంది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788గా ఉంది. ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 2,50,183 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 2.43 శాతానికి తగ్గింది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 224 మంది మృత్యుఒడికి చేరగా..మొత్తంగా 1,49,218 మంది ఈ మహమ్మారికి ప్రాణాలు వదిలారు. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమానికి ముందుడుగు పడింది. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పచ్చజెండా ఊపిన విష‌య  తెలిసిందే.


ఇదిలా ఉండ‌గా ఇండియాలో కొత్త స్ట్రెయిన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయ్. 29కు చేరింది ఆ నంబర్ ఇప్పుడు ! దీంతో ఏం జరగబోతుందన్న టెన్షన్ మరింతగా కనిపిస్తోంది జనాల్లో ! అసలే న్యూ ఇయర్ వేడుకలు.. ఆ తర్వాత సంక్రాంతి.. ఇలాంటి లెక్కలేసుకొని ఆందోళన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా స్ట్రెయిన్ వైరస్ కరోనా కేసులు 29కి చేరుకున్నాయి. కొత్తగా నలుగురికి స్ట్రెయిన్ నిర్దారణ అయ్యింది. దేశంలోని ఆరు ల్యాబ్ ల్లో యూకే స్ట్రెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మూడు స్ట్రెయిన్ కేసులు గుర్తించారు. వైరస్ పరీక్షల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.




కాలిఫోర్నియాలో 25వేల క‌రోనా మ‌ర‌ణాలు..వ‌ణికిపోతున్న జ‌నం..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>