CrimeSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/kurnoolf9345e5e-774a-4b16-a734-b519136772ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/kurnoolf9345e5e-774a-4b16-a734-b519136772ea-415x250-IndiaHerald.jpgవిజయనగరం జిల్లా రామతీర్థం కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం, రాజమండ్రి విగ్రహాల ధ్వంసం ఘటనలు మరువక ముందే.. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం మర్లబండలో మరో ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారాముల విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అంతేగాక ముఖద్వారం కడ్డీలు తొలగించి మరీ ఆలయ హుండీలను అపహరించారు దుండగులు. కాగా, కేవలం మూడు రోజుల క్రితమే ఆంజనేయస్వామి వారి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు భారీగా ముడుపులు కూడా చెల్లించుకున్నారుkurnool;cbn;ganga;deva;bharatiya janata party;ganges;district;telugu;kurnool;police;car;tdp;local language;rama tirtha;rajahmundry;ranarangamకర్నూల్ జిల్లాలో విగ్రహం ధ్వంసం చేసి హుండీ అపహరించిన దుండగులు...కర్నూల్ జిల్లాలో విగ్రహం ధ్వంసం చేసి హుండీ అపహరించిన దుండగులు...kurnool;cbn;ganga;deva;bharatiya janata party;ganges;district;telugu;kurnool;police;car;tdp;local language;rama tirtha;rajahmundry;ranarangamSat, 02 Jan 2021 20:00:00 GMTజిల్లా రామతీర్థం కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం, రాజమండ్రి విగ్రహాల ధ్వంసం ఘటనలు మరువక ముందే.. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం మర్లబండలో మరో ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారాముల విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అంతేగాక ముఖద్వారం కడ్డీలు తొలగించి మరీ ఆలయ హుండీలను అపహరించారు దుండగులు. కాగా, కేవలం మూడు రోజుల క్రితమే ఆంజనేయస్వామి వారి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు భారీగా ముడుపులు కూడా చెల్లించుకున్నారు. దీంతో హుండీలోని సొత్తు కోసమే దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.


ఇక ఇప్పటికే విజయనగరం జిల్లా రామతీర్థం రణరంగంగా మారింది. అగ్ర నాయకుల పర్యటనలతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొండపైకి వైఎస్సార్‌సీపీ జెండాలతో వెళ్లడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.. ఈ క్రమంలో టీడీపీ,బీజేపీ - పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విజయసాయిరెడ్డి కారుపై కొందరు దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అలాగే నాటకీయ పరిణామాల నడుమ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం రామతీర్థం చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి మరీ బోడికొండ పైకి బయల్దేరారు. చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు అలాగే మరికొందరు తెదేపా శ్రేణులు ఉన్నారు. విగ్రహం ధ్వంసమైన బోడికొండ ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఓవైపు రామతీర్థం వ్యవహారం వేడెక్కుతున్న తరుణంలో ఇప్పుడు ఇలా కర్నూలులో మరో ఆలయ ధ్వంసం ఘటన జరగటం కలకలం రేపుతోంది.


నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్ దెబ్బకు తెరాస విలవిల

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>