MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunac024b013-4f05-4b0c-952e-4620711afa85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunac024b013-4f05-4b0c-952e-4620711afa85-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున డిఫరెంట్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారనడంలో సందేహం లేదు. తాజాగా ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'వైల్డ్‌ డాగ్‌'. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది.పోస్ట్ ప్రొడక్షన్ దశని కూడా దాటింది.king;nagarjuna akkineni;ram gopal varma;vijay varma;ali;nageshwara rao akkineni;sai dharam tej;vijay;apple;cinema;december;producer;king;producer1;hero;king 1;letter;joseph vijay;european union;custard apple;reddy;vకింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?king;nagarjuna akkineni;ram gopal varma;vijay varma;ali;nageshwara rao akkineni;sai dharam tej;vijay;apple;cinema;december;producer;king;producer1;hero;king 1;letter;joseph vijay;european union;custard apple;reddy;vSat, 02 Jan 2021 18:13:32 GMTటాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున డిఫరెంట్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారనడంలో సందేహం లేదు. తాజాగా ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'వైల్డ్‌ డాగ్‌'. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది.పోస్ట్ ప్రొడక్షన్ దశని కూడా దాటింది.  కౌంటర్ టెర్రరిజం బ్యాక్  డ్రాప్ లో రూపొందే ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు.. దీంతో వైల్డ్‌ డాగ్‌ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.


 దీనితోపాటు ఏ ప్లాట్‌ఫామ్‌లో మూవీ రిలీజ్‌  కానుందనే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా సినిమాలు రిలీజ్‌ అయ్యియి. అయితే ప్రస్తుతం థియేటర్లు పునఃప్రారంభం అవ్వడంతో మెల్లమెల్లగా పెద్ద స్క్రీన్‌పై సినిమాలు విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.లాక్ డౌన్ లో బంద్ అయిన థియేటర్లు మళ్ళీ ఈ డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ సినిమాతో తెరుచుకున్నాయి. దాంతో సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరుగుతుంది. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

అదేంటంటే సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారట. డిసెంబర్‌ 25 నుండి థియేటర్స్‌లో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోలో బ్రతుకే  సోబెటర్‌, ఒరేయ్‌ బుజ్జిగా, వి వంటి సినిమాలు థియేటర్స్‌లో విడుదలయ్యాయి. అయితే స్టార్‌ హీరో అయిన నాగార్జన సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి  కనబర్చకపోవడంతో ఎలాంటి రిస్క్‌ తీసుకోకుండా సేఫ్‌ ట్రాక్‌లో వెళ్లేందుకు చిత్రయూనిట్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టాప్‌ డిజిటల్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు ఈ సినిమాకు చెందిన హక్కులను విక్రయించినట్లు సమాచారం.ఆ రేటు ఇప్పటిదాకా నాగ్ ఏ చిత్రానికి పలకలేదు.ఎంతా అంటే అక్షరాలా 27 కోట్లు. దాంతో ఈ కరోనా సమయంలో నాగ్ సినిమాకు ఆ రేట్ ఇవ్వటం ఆశ్చర్యంగా మారింది. ఇంతకీ ఆ రేటు  కేవలం ఓటీటి రేట్ మాత్రమే ఇది. శాటిలైట్ ని మరో పది కోట్లకు నిర్మాత అమ్ముకోవచ్చు.కాగా నాగ్‌తో పాటు అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌  ఈ మూవీ లో కనిపించనున్నారు. 


మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>