TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/npci77a80111-cbca-4546-8c74-ff953540dd7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/npci77a80111-cbca-4546-8c74-ff953540dd7c-415x250-IndiaHerald.jpgదేశంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ పోతోంది. నోట్ల రద్దు సమయంలో మొదలైన ఈ హవా కరోనా సమయంలో మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా స్కానర్లు కనిపిస్తున్నాయి. గతంలో కేవలం వేలలో ట్రాన్సక్షన్లు జరిగే ప్రదేశాల్లో మాత్రమే ఈ ఆన్‌లైన్ పేమెంట్లకు సంబంధించిన npci;india;smart phone;google;google pay appబుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?npci;india;smart phone;google;google pay appSat, 02 Jan 2021 14:45:10 GMT
పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ఇలా కంపెనీలు ఎన్ని ఉన్నా ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లను జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న మొన్నటి దాకా ఓ వార్త తెగ ట్రెండింగ్ అయిపోయింది. అదేంటంటే.. జవనరి ఒకటో తేదీ నుంచి స్కాన్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి సారి అదనంగా చార్జీలు వసూలు చేస్తారని ప్రచారం సాగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వందల వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ అంశం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) దృష్టికి వెళ్లింది. దీనిపై ఎన్‌పీసీఐ స్పందిస్తూ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి చార్జీలను వసూలు చేయలేదని, చేయబోమని తెలిపింది. ఇటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించింది. కాగా.. ఈ యూపీఐ ట్రాన్సక్షన్లు కేవలం దుకాణాలకే పరిమితం కాలేదు. అనేక మంది తమ ఇళ్లకు, స్నేహితులకు, సన్నిహితులకు కూడా యూపీఐ ట్రాన్సక్షన్ల ద్వారానే నగదును పంపిస్తున్నారు. దేశంలో చాలా మంది ఏటీఎంలకు వెళ్లడం కూడా మానేశారంటే నమ్ముతారా? ఆన్ లైన్ ట్రాన్సక్షన్లు పెరిగిపోవడం వల్ల ఏటీఎంలో నగదును విత్ డ్రా చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. కరోనా సమయంలో డబ్బు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందని వార్తలు రావడం వల్ల కూడా చాలా మంది ఏటీఎంల వైపు చూడటం మానేశారు.


ఎఫ్3లో ముక్కు అవినాష్...?

జగన్ సర్కార్ కు "కాగ్" శుభవార్త ....!?

"షోజ్" నోటీసు తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...!?

కేకు కోస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత.. అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>