PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/velaga16517386-4af6-4db2-a9af-253179a13b02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/velaga16517386-4af6-4db2-a9af-253179a13b02-415x250-IndiaHerald.jpgవిశాఖ రాజకీయాలు కూల్ కూల్ గా ఉంటాయి. ఇక్కడ ఎన్నికల వేళ తప్ప మిగిలిన సమయం అంతా ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ఇపుడు చూస్తే కధ మారుతోంది అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాక వైసీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే విశాఖలో బలంగా పాతుకుపోయిన తెలుగుదేశం నుంచి వైసీపీకి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఇపుడు విశాఖ రాజకీయం యమ జోరు గా సాగుతోంది. velaga;cbn;mp;telugu;vishakapatnam;murder.;tdp;ycp;vangaveeti;velagapudiవిశాఖ రాజకీయాల్లో వంగవీటి రంగా ప్రకంపనలు ?విశాఖ రాజకీయాల్లో వంగవీటి రంగా ప్రకంపనలు ?velaga;cbn;mp;telugu;vishakapatnam;murder.;tdp;ycp;vangaveeti;velagapudiSat, 02 Jan 2021 10:30:00 GMTవిశాఖ రాజకీయాలు కూల్ కూల్ గా ఉంటాయి. ఇక్కడ ఎన్నికల వేళ తప్ప మిగిలిన సమయం అంతా ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ఇపుడు చూస్తే కధ మారుతోంది అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాక వైసీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే విశాఖలో బలంగా పాతుకుపోయిన తెలుగుదేశం నుంచి వైసీపీకి  తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఇపుడు విశాఖ రాజకీయం యమ జోరు గా సాగుతోంది.

విశాఖలో టీడీపీ నుంచి మూడు సార్లు గెలిచిన బలమైన ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామక్రిష్ణ బాబుని టార్గెట్ గా చేసుకుని తాజాగా వైసీపీ అస్త్రాలను సంధిస్తోంది.  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే వెలగపూడిని అసలు వదలమని అంటున్నారు. ఆయన అవినీతి అక్రమాలను కూడా బయటకు ఒక్కొక్క‌టిగా తెస్తామని కూడా చెబుతున్నారు.  విజయవాడకు చెందిన రామక్రిష్ణ బాబు విశాఖకు వలస వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆయన వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడు అంటూ ఇప్పటికి పలు మార్లు  ఆరోపించిన విజయసాయిరెడ్డి తాజాగా మరో మాట కూడా వాడారు. రంగా హత్యకు స్కెచ్ అంతా విజయవాడలో వెలగపూడి రామక్రిష్ణ బాబు రాగమాలిక  సీడీ షాప్ లోనే వేశారంటూ మరో అసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. విజయవాడలో వెలగపూడిని రాగమాలిక రామ‌క్రిష్ణ అని పిలుస్తారని కూడా చెప్పుకొచ్చారు.

ఇక వెలగపూడి వంగవీటి రంగా హత్య జరిగిన తరువాత విశాఖకు వచ్చారని, ఆయన ఇక్కడ రాజకీయాల్లో ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూడా వెలగపూడి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక రామక్రిష్ణ విద్యార్హతలు కూడా తప్పు అని, వాటిని త్వరలోనే నిరూపిస్తామని అంటున్నారు. అంతే కాదు, వెలగపూడి విశాఖను అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు, అవినీతి భాగోతాలను తొందరలోనే బయటపెడతమని కూడా హెచ్చరించారు. ఆయన బినామీలు కూడా చాలా మంది  ఉన్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరికలతో విశాఖ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వెలగపూడికి వంగవీటి రంగా హత్య కేసులో ప్రమేయం ఉందని వైసీపీ ఎంపీ  పదే పదే చేస్తున్న విమర్శలు విశాఖ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.





పార్టీ మార్పుపై తుమ్మ‌ల సంచ‌ల‌నం... స‌త్తుప‌ల్లిలో భారీ స‌మావేశం..!

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>