PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/javadekar94df0b8d-98ba-422c-8829-7427d03f42ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/javadekar94df0b8d-98ba-422c-8829-7427d03f42ce-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఈ మహమ్మారితో పోరాడేందుకు ప్రపంచంలో చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నించాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. అయితే ఈ ప్రయత్నాలు చేసిన చాలా కొన్ని దేశాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ దేశాల సరసన చేరేందుకు సిద్ధం అయింది. మన దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడేందుకు నాలుగు టీకాలు సిద్ధం చేస్తున్నారు.javadekar;delhi;india;minister;application;success;central governmentభారత్‌లో ఎన్ని కరోనా టీకాలు రెడీ అవుతున్నాయో తెలుసా?భారత్‌లో ఎన్ని కరోనా టీకాలు రెడీ అవుతున్నాయో తెలుసా?javadekar;delhi;india;minister;application;success;central governmentSat, 02 Jan 2021 19:54:46 GMTన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలిసిందే. ఈ మహమ్మారితో పోరాడేందుకు ప్రపంచంలో చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నించాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. అయితే ఈ ప్రయత్నాలు చేసిన చాలా కొన్ని దేశాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ దేశాల సరసన చేరేందుకు సిద్ధం అయింది. మన దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడేందుకు నాలుగు టీకాలు సిద్ధం చేస్తున్నారు. ఇన్ని టీకాలు తయారు చేస్తున్న ఒకే ఒక దేశం బహుశా భారతేనని, మరే దేశమూ ఇన్ని వ్యాక్సిన్ లు సిద్ధం చేయడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కరోనా టీకా అత్యవసర వినియోగం కోసం ఇప్పటికి మూడు దరఖాస్తులు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. ఈ విషయాన్ని జవదేకర్ ప్రస్తావించారు. వీటిలో ఒకటి కంటే ఎక్కువ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశం చాలా ఉందని ఆయన చెప్పారు. టీకా పంపిణీ వ్యవస్థల పనితీరు, వాటిలో వచ్చే సమస్యలను తెలుసుకునేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా డ్రై రన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

భారత్‌లో కరోనాకు సంబంధించి ప్రస్తుతం ఆరు టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిలో ఆక్సఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవీషీల్డ్, బారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్‌ ప్రభుత్వం ముందుకు తొలిగా వచ్చాయి. వీటిలో కోవీషీల్డ్‌‌ అత్యవసర వినియోగానికి కేంద్రం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. కోవ్యాక్సిన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇవి కాక.. క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్-కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి పరుస్తున్న జైకోవ్-డీ, నోవోవాక్స్-సీరమ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందింస్తున్న ఎన్‌వీఎక్స్ -  సీఓవీ2373, బయాలాజికల్ ఈ లిమిటెడ్, ఎమ్‌ఐటీ తయారు చేస్తున్న టీకా, జెన్నోవా ఆధ్వర్యంలో రూపొందుతున్న టీకా కూడా అత్యవసర వినియోగ అనుమతుల రేసులో ఉన్నాయి.


నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్ దెబ్బకు తెరాస విలవిల

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>