PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/google3baf01a7-7747-4de0-9326-8d58f3df632c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/google3baf01a7-7747-4de0-9326-8d58f3df632c-415x250-IndiaHerald.jpgగూగుల్‌.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు చాలా అరుదు. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా జనం ఎక్కువగా ఆశ్రయిస్తున్నది దీన్నే.. దీనిలో సమాధానం తెలియని ప్రశ్నలు చాలా అరుదు. దేని గురించి సమాచారం కావాలన్నా ముందు గూగుల్‌ ను అడుగు అని చెబుతుంటారు. అలాంటి గూగుల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ అడుగు పెట్టింది. అవును మరి. మొన్నటికి మొన్న.. ఓ న్యాయమూర్తి జగన్ గురించి గూగుల్‌లో కొడితే ఏం వస్తుందో ఏకంగా తన తీర్పులోనే రాశారు. జస్టిస్ రాకేశ్‌ కుమార్‌ తన తీర్పులో ఏం రాశారంటే.. ముఖ్యమంత్రి సీజేఐకి రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు జgoogle;nani;amala akkineni;kumaar;kodali nani;jagan;andhra pradesh;google;chief minister;cbi;minister;khaidi.;letter;reddy;khaidi new;mantraఏపీ రాజకీయాల్లోకి గూగుల్..? జగన్ గురించి షాకింగ్‌ విషయాలు ..?ఏపీ రాజకీయాల్లోకి గూగుల్..? జగన్ గురించి షాకింగ్‌ విషయాలు ..?google;nani;amala akkineni;kumaar;kodali nani;jagan;andhra pradesh;google;chief minister;cbi;minister;khaidi.;letter;reddy;khaidi new;mantraSat, 02 Jan 2021 10:00:00 GMTగూగుల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ అడుగు పెట్టింది. అవును మరి. మొన్నటికి మొన్న.. ఓ న్యాయమూర్తి జగన్ గురించి గూగుల్‌లో కొడితే ఏం వస్తుందో ఏకంగా తన తీర్పులోనే రాశారు.

జస్టిస్ రాకేశ్‌ కుమార్‌ తన తీర్పులో ఏం రాశారంటే.. ముఖ్యమంత్రి సీజేఐకి రాసిన లేఖ ప్రచురితమయ్యే వరకు జగన్  గురించి తనకు పెద్దగా తెలియదని... ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగిందని... గూగుల్‌లో ఖైదీ నంబర్‌ 6093 అని కొడితే చాలా సమాచారం వస్తుందని ఎవరో చెప్పారని.. తాను అలా చేసేసరికి దిగ్భ్రాంతి కలిగించే సమాచారం లభించిందని రాశారు. తాను డౌన్‌లోడ్‌ చేసిన సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నానని... ఆ తర్వాత కొంత సాధికారిక సమాచారం తెప్పించుకున్నానని... జగన్‌పై 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు, ఐపీసీ సెక్షన్‌ కింద నమోదు చేసిన మరో 18 కేసులు ఉన్నట్టు తెలిసిందని రాకేశ్ కుమార్ అన్నారు.

ఇప్పుడు దీనికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి నాని తన గూగుల్ అనుభవాలు మీడియాతో పంచుకున్నారు. తాను గూగుల్‌లో జగన్ గురించి వెదికితే.. అవతలి వైపు ఎంత బలవంతులున్నా ఢీకొట్టే వ్యక్తిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని గూగుల్‌లో ఉందని మంత్రి కొడాలి నాని చెప్పారు.  దేశ చరిత్రలో ఏ సీఎం చేయని సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లోనే కాదు.. గూగుల్‌లో కూడా నిలిచిపోయారన్నారు.

పదవీ విరమణ చేసిన ఓ న్యాయమూర్తి గూగుల్‌లో సీఎం గురించి సెర్చ్‌ చేస్తే ఏదో వస్తుందని తీర్పులో రాశారని తప్పుపట్టారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే వచ్చిందని ఆర్డర్‌లో పెట్టారన్నారు. తాను సీఎం వైయస్‌ జగన్‌ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఆయన కుటుంబ నేపథ్యముందని పేర్కొన్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవతలివైపు ఎంత బలవంతులున్నా ఢీకొట్టే వ్యక్తిగా గూగుల్‌లో ఉందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇలా మొత్తానికి గూగుల్ ఏపీ రాజకీయాల్లోనూ అడుగు పెట్టిందన్నమాట.




నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీకి అరుదైన గౌరవం..!?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>