MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-stars-movies-after-their-deathde3f21b4-183d-4fe7-b3e1-8f595538ca9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-stars-movies-after-their-deathde3f21b4-183d-4fe7-b3e1-8f595538ca9c-415x250-IndiaHerald.jpgసినిమాల్లో నటించే నటులు తమ మంచితనంతో ఎంత బాగా దగ్గరవుతారో, అలానే ఏదో ఒకరోజు మనకి దూరంగా వెళ్లిపోతారు. అలా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అలా చాలా మంది నటులు అర్ధాంతరంగా మరణించి ప్రేక్షకాభిమాన లోకానికి తీవ్ర శోకాన్ని మిగిల్చారు. tollywood stars movies after their death;kumaar;ms dhoni;raaj kumar;soundarya;sushant singh;aarthi;aarti agarwal;achyuth;editor mohan;m s narayana;nageshwara rao akkineni;raj;srihari;sushanth;tara;ram madhav;bollywood;tollywood;cinema;telugu;january;2020;october;heroine;june;research and analysis wing;legend;dil;partyఈ 13 మంది నటీనటులు చనిపోయిన తర్వాత రిలీజైన ఆఖరి సినిమాలుఈ 13 మంది నటీనటులు చనిపోయిన తర్వాత రిలీజైన ఆఖరి సినిమాలుtollywood stars movies after their death;kumaar;ms dhoni;raaj kumar;soundarya;sushant singh;aarthi;aarti agarwal;achyuth;editor mohan;m s narayana;nageshwara rao akkineni;raj;srihari;sushanth;tara;ram madhav;bollywood;tollywood;cinema;telugu;january;2020;october;heroine;june;research and analysis wing;legend;dil;partySat, 02 Jan 2021 10:14:01 GMTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం ఎవరూ ఊహించలేనిది. ధోని సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సుశాంత్, 2020 జూన్ 14 న మరణించారు. ఆయన మరణించిన తర్వాత సుశాంత్ నటించిన ఆఖరి సినిమా "దిల్ బెచారా" ఓటీటీలో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇక టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు చనిపోయిన 5 నెలల తర్వాత మనం సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. జనవరి 22 2014 లో ఏఎన్నార్ చనిపోతే, మే 23 న ఈ సినిమా రిలీజైంది. అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటనలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆప్తమిత్ర, మోహన్ బాబు హీరోగా నటించిన శివశంకర్ సినిమాలు రిలీజయ్యాయి. 19 ఏళ్లకే హీరోయిన్ అయిన దివ్యభారతి మరణం ఎంతోమందిని కలచివేసింది. ఈమె 1993 లో చనిపోయారు. ఈమె మరణం తర్వాత బాలీవుడ్ లో రంగ్, శత్రంజ్, తెలుగులో తొలిముద్దు సినిమాలు రిలీజయ్యాయి. నటి ప్రత్యూష అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2002 లో  అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఇప్పటికీ ఈమె మరణం మిస్టరీగానే ఉంది. ఈమె చనిపోయేముందు చేసిన ఆఖరి సినిమా సౌండ్ పార్టీ. ఈమె మరణానంతరం రిలీజైంది. టాలీవుడ్ కోల్పోయిన మరో గొప్ప నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఈయన 2013 లో అక్టోబర్ 9 న మరణించారు. ఈయన చనిపోయిన తర్వాత బాలీవుడ్ లో రాంబో రాజ్ కుమార్ సినిమా రిలీజవ్వగా, తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. ఇలానే ఆర్తి అగర్వాల్, నటుడు అచ్యుత్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి నటులు టాలీవుడ్ లో విషాదం నింపగా, వీరు నటించిన చివరి సినిమాలు రిలీజై ప్రేక్షకలోకాన్ని మెప్పించాయి.





ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>