PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4882de91-36ca-4723-9ce3-5b966b1cdfd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi4882de91-36ca-4723-9ce3-5b966b1cdfd5-415x250-IndiaHerald.jpgఅదేంటో కొత్త ఏడాది వస్తూనే కొత్త విషయాలను చెబుతోంది. గతకాలం చేదు కాలమని అంతా ఏకగ్రీవంగా అంగీకరించాక కొత్త ఏడాది రెండవ రోజునే కేంద్రం దేశంలోని 130 కోట్ల ప్రజలకు శుభ వార్తనే చెవులారా వినిపించింది. 2020ని ఒక పీడగా చీడగా అంతా భావిస్తున్న వేళ జనాల తీపి కబురుగానే దీన్ని చూడాలి. modi;modi;minister;doctor;good news;central government;nijam;good newwz;coronavirusఅతి పెద్ద గుడ్ న్యూస్ చెప్పిన మోడీ ?అతి పెద్ద గుడ్ న్యూస్ చెప్పిన మోడీ ?modi;modi;minister;doctor;good news;central government;nijam;good newwz;coronavirusSat, 02 Jan 2021 20:00:00 GMT
ఇక ఒక వైపు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం కేంద్రం డ్రై రన్ చేపడుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వెరీ వెరీ  గుడ్ న్యూస్  దేశానికి చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లను దేశమంతటా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ రొజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశమంతటా కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఇది నిజంగా శుభ పరిణామమే. కరోనాతో దేశంలోని జనాలంతోఅ పెద్ద యుధ్ధమే చేశారు. ఆర్ధికంగా మానసికంగా, శారీరకంగా తీవ్రంగా నష్టపోయారు. లాక్ డౌన్ లతో అన్ని రకాలైన ఇబ్బందులను పంటి బిగువున ఎదుర్కొన్నారు.

తమ వారిని, రక్త సంబంధీకులను కోల్పోయారు. ఆఖరి చూపులను కూడా అయిన వారి నుంచి చూసి ఎరగరు. ఈ విధంగా తన జీవితాలలో ఒక విలువైన ఏడాది చాలా రకాలైన బీభత్సాన్ని సృష్టించి అదృశ్యం అయిందని తెలిసి కూడా మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇపుడు వారి శ్రమకు తగిన ఫలితం లభించబోతోంది.

దేశంలో కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ కొందరికి మాత్రమే ఉచితం అని ఇంతదాకా వినిపించిన మాట. కానీ ఇపుడు కేంద్రం మరో అడుగు ముందుకేసి అన్ని వర్గాల ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందిస్తామంటూ చేసిన ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా వ్యాక్సిన్ డబ్బు పెట్టి కొనుగోలు చేయలేని నిస్సహాయత దేశంలోని ఎనభై శాతం ప్రజలలో ఉంది. అందువల్ల వారందరికీ కేంద్రం చేసిన ప్రకటన కొత్త ఊపిరిని ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా కొత్త ఏడాది నాడే కేంద్రం ఈ రకమైన సమాచారం ఇవ్వడం ద్వారా గట్టి భరోసా ఇచ్చిందనే చెప్పాలి. అది ఆచరణకు నోచుకుని ఆరోగ్య భారతం దిశగా దేశం వేగంగా అడుగులు వేయాలని అంతా కోరుకుంటున్నారు.







దాదాసాహెద్ ఫాల్కే అందుకున్న తెలంగాణ నటుడు ఎవరో తెలుసా.

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>