Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/31st-night-party65782947-dcb2-4c96-bc89-6d0d2aec8305-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/31st-night-party65782947-dcb2-4c96-bc89-6d0d2aec8305-415x250-IndiaHerald.jpgమీరు న్యూఇయర్ ఎలా చేసుకున్నారు..? గ్రాండ్‌గా చేసుకునే ఉంటారు లెండి. పార్టీలు, పబ్బులు, మందు, విందు.. ఇలా తెగ హంగామా చేసి ఉంటారు. దానికోసం ఎంత ఖర్చు చేసి ఉంటారు..? ఎంతన్నా ఖర్చు చేయండి, దానికోసం మీ పాకెట్ మనీ ఖర్చు చేసి ఉంటారు, లేదా ఇంట్లో తీసుకుని ఉంటారు. కానీ కేవలం న్యూ ఇయర్ పార్టీ..31st night party;district;january;nalgonda;december;sakshi;miryalaguda;v;partyఇంత పిచ్చేంటి సామి.. న్యూ ఇయర్ పార్టీ కోసం అప్పు.. వైరల్ అవుతున్న ప్రామిసరీ నోట్!ఇంత పిచ్చేంటి సామి.. న్యూ ఇయర్ పార్టీ కోసం అప్పు.. వైరల్ అవుతున్న ప్రామిసరీ నోట్!31st night party;district;january;nalgonda;december;sakshi;miryalaguda;v;partySat, 02 Jan 2021 10:39:37 GMTఇంటర్నెట్ డెస్క్: మీరు న్యూఇయర్ ఎలా చేసుకున్నారు..? గ్రాండ్‌గా చేసుకునే ఉంటారు లెండి. పార్టీలు, పబ్బులు, మందు, విందు.. ఇలా తెగ హంగామా చేసి ఉంటారు. దానికోసం ఎంత ఖర్చు చేసి ఉంటారు..? ఎంతన్నా ఖర్చు చేయండి, దానికోసం మీ పాకెట్ మనీ ఖర్చు చేసి ఉంటారు, లేదా ఇంట్లో తీసుకుని ఉంటారు. కానీ కేవలం న్యూ ఇయర్ పార్టీ కోసం అప్పు చేసి మాత్రం ఉండరు. అయితే కొంత మంది మహానుభావులు మాత్రం అలా కాదు. చేతిలో డబ్బులు లేకపోయానా అప్పు చేసైనా న్యూ ఇయర్ పార్టీ గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

ఫ్రెండ్స్‌కు న్యూఇయర్ పార్టీ ఇచ్చేందుకు ఓ యువకుడు అప్పు చేసి దానికోసం ప్రామిసరీ నోటు సైతం రాసిచ్చాడు. అప్పు తీసుకొని మరి స్నేహితులకు దావత్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ పోస్టుకు లైకులు.. కామెంట్లు విపరీతంగా వచ్చాయి. ఇప్పుడా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలానికి చెందిన అంజి.. డిసెంబర్ 31న ఫ్రెండ్స్‌కు దావత్ ఇవ్వాలనుకున్నాడు. దానికోసం ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి నెలకు రూపాయిన్నర చొప్పున వడ్డీ కూడా చెల్లించడానికి అంగీకరించాడు. తీసుకున్న అప్పు కోసం ఓ ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. దానిపై మరో ఐదుగురు వ్యక్తులు సాక్షి సంతకాలు కూడా చేశారు.

ఈ ప్రామిసరీ నోటు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ప్రామిసరీ నోటుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. 31 నైట్ అయిపోయింది.. దావత్ అయిపోయింది... జనవరి 1వతేదీ కూడా గడిచిపోయింది. కానీ.. రెండు రోజుల నుంచి ఆ నోట్ మాత్రం వైరల్ అవుతూనే ఉంది.


కాలిఫోర్నియాలో 25వేల క‌రోనా మ‌ర‌ణాలు..వ‌ణికిపోతున్న జ‌నం..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>