PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest653d0b33-d177-4b72-954e-6df421cbedfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest653d0b33-d177-4b72-954e-6df421cbedfb-415x250-IndiaHerald.jpgకేంద ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే గత నెల 30న జరిగిన చర్చలకు సంబంధించి కేంద్ర సర్కార్, రైతుల సంఘాల మధ్య వివాదం జరుగుతోంది. రైతులు తమ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి చెబుతుండగా.. రైతు సంఘాల ప్రతినిధులు మాత్రం అలాంటేమి లేదంటున్నారు. farmers protest;vidya;india;minister;central governmentచర్చలపై కేంద్రం అబద్దం చెబుతోంది!చర్చలపై కేంద్రం అబద్దం చెబుతోంది!farmers protest;vidya;india;minister;central governmentSat, 02 Jan 2021 08:09:50 GMTకేంద ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆపేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గత నెల 30న జరిగిన చర్చలకు సంబంధించి కేంద్ర సర్కార్, రైతుల సంఘాల మధ్య వివాదం జరుగుతోంది. రైతులు తమ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి చెబుతుండగా.. రైతు సంఘాల ప్రతినిధులు మాత్రం అలాంటేమి లేదంటున్నారు.


      నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో గత నెల 30న జరిగిన ఆరో విడత చర్చల్లో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నదాంట్లో నిజం లేదని రైతు సంఘాలు తెలిపాయి. గతంలో జరిగిన చర్చల్లానే ఈ సమావేశం కూడా ముగిసిందని పేర్కొన్నాయి. గత నెల 30న ఢిల్లీలో ఐదు గంటలపాటు ప్రభుత్వం, రైతు సంఘాల నేత మధ్య చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఇరు వర్గాల మధ్య రెండు అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు. విద్యుత్తు సవరణ చట్టంతో పాటు వాయుకాలుష్యం ఆర్డినెన్సులో రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో రైతులు, ప్రభుత్వం మధ్య ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిపారు.


     అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చెబుతున్న దాంట్లో నిజం లేదని స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం, కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీలే తమ ప్రధాన డిమాండ్లు అని తేల్చి చెప్పారు. ఈ నెల 4న జరగనున్న ఏడో విడత చర్చల్లో కనుక ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకుంటే ఆరో తేదీన కుండ్లీ నుంచి మనేసర్ మీదుగా పల్వాల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని యోగేంద్ర యాదవ్ తెలిపారు.




కరోనాకు 'ఎర్రచీమల పచ్చడి' మంచిదేనా?

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>