MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyana4632c95-bb43-454c-a05d-6f9264107547-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyana4632c95-bb43-454c-a05d-6f9264107547-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య స్నేహం ఎటువంటిదో కొత్తగా చెప్పనక్కరలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సమయంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. pawankalyan;pawan;jayanth;pawan kalyan;srinivas;trivikram srinivas;cinema;huzur nagar;industry;remake;agnyaathavaasi;allu sneha;attharintiki daredi;jayanth c paranjee;jayam;chitramపవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!pawankalyan;pawan;jayanth;pawan kalyan;srinivas;trivikram srinivas;cinema;huzur nagar;industry;remake;agnyaathavaasi;allu sneha;attharintiki daredi;jayanth c paranjee;jayam;chitramSat, 02 Jan 2021 00:16:26 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య స్నేహం ఎటువంటిదో కొత్తగా చెప్పనక్కరలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సమయంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. అయినప్పటికి వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా అంటే మాత్రం ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా రావడం లేదనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారట.

అందుకే పవన్ కల్యాణ్‌తో మరో సినిమా తీయడానికి ఈ దర్శకుడు కొంచెం జంకుతున్నారని సమాచారం. కానీ.. పవర్ స్టార్‌తో నేరుగా సినిమా తీయకపోయినా వెనుక నుంచి కథ నడిపించేందుకు ఈ మాటల మాంత్రికుడు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ మళయాళం చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నప్పటికి తెర వెనుక మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారని వినికిడి. కీలక సన్నివేశాలు, స్క్రీన్ ప్లే బాధ్యత త్రివిక్రమ్ చూస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాకు తానే నేరుగా దర్శకత్వం వహిస్తే అంచనాలు అమాంతం పెరిగిపోతాయని, రీమేక్ సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా అనే సందేహం కారణంగానే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం చేసేందుకు వెనకడుగే వేశారని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ వెనుకుండి నడిపిస్తారని చెప్పడంతోనే పవన్ కల్యాణ్రీమేక్ చిత్రానికి సై అన్నారని కూడా చర్చ సాగుతోంది. గతంలో పవన్ కల్యాణ్ నటించిన తీన్ మార్ చిత్రానికి దర్శకత్వం జయంత్ సి.పరాన్జీ చేయగా... మాటలు మాత్రం త్రివిక్రమ్ రాశారు. ఆ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనప్పటికి ఆ సినిమాలో త్రివిక్రమ్ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ రీమేక్‌లో కూడా అదే విధంగా త్రివిక్రమ్ ఫ్లేవర్ కనిపిస్తుందేమో చూడాలి.


తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>