MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/2020-left-with-a-bitter-experiencece9f118d-95fa-45a2-ae03-f30374f4918e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/2020-left-with-a-bitter-experiencece9f118d-95fa-45a2-ae03-f30374f4918e-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ రేటు ఎప్పుడూ 10 శాతమే. మూడు నెలల్లో రిలీజైన 50 సినిమాల్లో 45 సినిమాల అడ్రస్సులు గల్లంతయ్యాయి. తమిళంలో 50 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిన 96 సినిమాను సమంత, శర్వానంద్‌తో తెలుగులో జాను పేరుతో రీమేక్‌ చేశారు. హీరోహీరోయిన్లు పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నా.. కథనం మరీ స్లో కావడంతో... కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాపులు చూస్తున్న విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ తర్వాత వచ్చిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ కూడా డిజాస్టర్‌ అయింది. ఒకే క్యారెక్టర్‌లో మూడు వేరియేషన్స్2020 left with a bitter experience;ravi teja;samantha;cinema;telugu;tamil;2020;heart;comedian;96;research and analysis wing;discoraja;kalabhairava;devarakondaచేదు అనుభవం మిగిల్చిన 2020 !చేదు అనుభవం మిగిల్చిన 2020 !2020 left with a bitter experience;ravi teja;samantha;cinema;telugu;tamil;2020;heart;comedian;96;research and analysis wing;discoraja;kalabhairava;devarakondaSat, 02 Jan 2021 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ రేటు ఎప్పుడూ 10 శాతమే. మూడు నెలల్లో రిలీజైన 50 సినిమాల్లో 45 సినిమాల అడ్రస్సులు గల్లంతయ్యాయి. తమిళంలో 50 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిన 96 సినిమాను సమంత, శర్వానంద్‌తో తెలుగులో జాను పేరుతో రీమేక్‌ చేశారు. హీరోహీరోయిన్లు పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నా.. కథనం మరీ స్లో కావడంతో... కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు.

బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాపులు చూస్తున్న విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ తర్వాత వచ్చిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ కూడా  డిజాస్టర్‌ అయింది. ఒకే క్యారెక్టర్‌లో మూడు వేరియేషన్స్‌ చూపించినా... ప్రేక్షకులను బోర్‌ కొట్టించాడు ఈ ఫేమస్‌ లవర్‌.

రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కోరాజా మెప్పించలేకపోయింది. ఎక్కడికిపోతావు చినవాడా ఫేం విఐ ఆనంద్‌ దర్వకత్వంలో సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా డిస్కోరాజా రూపొందింది.  బాక్సాఫీస్‌ను మెప్పించడంలో డిస్కోరాజా ఫెయిల్‌ అయ్యాడు.

కరోనాతో థియేటర్స్‌ 9 నెలలు మూతపడ్డాయి.  రీసెంట్‌గా థియేటర్స్‌ తెరుచుకున్నా.. జనాలు వస్తారా? రారా అన్న భయం ఎగ్జిబిటర్లు... డిస్ట్రిబ్యూటర్స్‌.. నిర్మాతలకే కాదు అందరిలో ఉంది. ఈ సమయంలో రిలీజైన తొలి క్రేజీ మూవీ 'సోలో బతుకే సో బెటర్‌' మంచి వసూళ్లు సాధించి సంక్రాంతికి వస్తున్నసినిమాల్లో ధైర్యం నింపింది.


కరోనా సీజన్‌ మొదలైన తర్వాత థియేటర్స్‌లేని ప్లేస్‌ను ఓటీటీలు భర్తీ చేశాయి. ఓటీటీలో దాదాపు పాతిక  సినిమాలు స్ట్రీమ్‌ అయితే..  20 సినిమాలు ఓటీటీలో వచ్చిన సంగతే చాలామందికి తెలీదు. పబ్లిసిటీ లేకపోవడం.. కథలో దమ్ము లేకపోవడంతో... సబ్‌ స్ట్రైబర్స్‌ కూడా వీటిని పట్టించుకోలేదు. అయితే కొన్ని సినిమాలు పాజిటివ్‌ టాక్తో కలర్‌ఫొటో.. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌.. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.. ఆకాశమే నీ హద్దురా వంటి సినిమాలు ఓటీటీలో మెప్పించాయి.

కమెడియన్ సుహాస్‌  హీరోగా నటించిన కలర్‌ఫొటోలో క్రేజీ కాస్టింగ్‌ లేకపోయినా..  ఓటీటీ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసింది. దర్శకుడు సందీప్‌రాజ్‌ హార్ట్ టచింగ్‌ మేకింగ్‌... కాలభైరవ మ్యూజిక్‌ .. నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ప్రేక్షకులకు నచ్చి  పాజిటివ్‌ టాక్ తీసుకొచ్చారు. ఇదే సినిమా థియేటర్‌లో వస్తే.. నటీనటులకు మరింత క్రేజ్ వచ్చేది.




లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>