MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhadha-saheb-falke-award22489234-ecbc-4771-b899-307b1d427663-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhadha-saheb-falke-award22489234-ecbc-4771-b899-307b1d427663-415x250-IndiaHerald.jpgనవీన్ కెరీర్ స్టార్టింగ్ లో ఉండగానే పెద్ద అవార్డు కు ఎంపికయ్యాడు. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పుడు ఈ యువ నటుడిని వరించింది. తెలుగు సినిమా విభాగంలో ఉత్తమ నటన కనబరిచిన నవీన్ పోలిశెట్టికి ఈ అవార్డు వచ్చింది.dhadha saheb falke award;dadasaheb phalke;nagarjuna akkineni;ajith kumar;atreya;dhanush;geetha;jyothika;naveen polishetty;rashmika mandanna;thaman s;bollywood;cinema;sangeetha;saaho;tamil;asuran;jersey;kannada;february;digital wallet platform;yuva;dear comrade;taj mahal;indian;ajit pawar;santoshamయువ నటుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు...!యువ నటుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు...!dhadha saheb falke award;dadasaheb phalke;nagarjuna akkineni;ajith kumar;atreya;dhanush;geetha;jyothika;naveen polishetty;rashmika mandanna;thaman s;bollywood;cinema;sangeetha;saaho;tamil;asuran;jersey;kannada;february;digital wallet platform;yuva;dear comrade;taj mahal;indian;ajit pawar;santoshamSat, 02 Jan 2021 13:00:00 GMTసినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో అందరి ప్రశంసలందుకున్న యువ నటుడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాలో తాను నటించిన తీరు ఇండస్ట్రీలో పెద్దవారిని సైతం మెప్పించింది. దీనితో ఆయనకు పలు అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో రిలీజైన చిచోరే సినిమాలో కూడా మంచి నటన కనబరిచారు. ఇంతటి టాలెంట్ ఉన్న నవీన్ పోలిశెట్టి భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయిలో ఉండాలని ఇతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు నవీన్ కెరీర్ స్టార్టింగ్ లో ఉండగానే పెద్ద అవార్డు కు ఎంపికయ్యాడు. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పుడు ఈ యువ నటుడిని వరించింది. తెలుగు సినిమా విభాగంలో ఉత్తమ నటన కనబరిచిన నవీన్ పోలిశెట్టికి ఈ అవార్డు వచ్చింది.

"మోస్ట్ వెర్సటైల్ యాక్టర్" విభాగంలో తెలుగు సినీ మన్మధుడు నాగార్జున కు అవార్డు లభించింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 అవార్డుల ప్రదానోత్సవం 2021 ఫిబ్రవరి 20 న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ లో జరుగనుంది. ఈ అవార్డు ప్రధానోత్సవ భాగంలో మరి కొన్ని అవార్డుల వివరాలను ఒకసారి చూస్తే డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక మందన్న ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడి జాబితాలో ఉత్తమ దర్శకుడిగా సాహో దర్శకుడు సుజీత్ గెలుచుకోవడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. ఎస్ ఎస్ థమన్ కు జెర్సీ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకోనున్నారు.

తమిళ విభాగంలో అసురన్ మూవీ లో అత్యుత్తమ నటనకు గాను ధనుష్ అవార్డును పొందనున్నారు. అలాగే ఉత్తమ నటిగా జ్యోతిక ఎన్నిక అయింది. ఉత్తమ దర్శకుడిగా పార్థిపన్ అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. కాగా మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ అవార్డును అజిత్ సొంతం చేసుకున్నాడు. ఉత్తమ చిత్రం విభాగంలో "టు లెట్"  మూవీ అవార్డును గెలుచుకుంది. ఇతర భాషలయిన కన్నడ మరియు మలయాళంలో  కూడా మీ అభిమాన నటీ నటులు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.


టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీస్ ను వదులుకున్న మహేష్ బాబు!

కేకు కోస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నేత.. అవతలి వ్యక్తి ఏం చేశాడంటే..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>