MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ru-200-kotluku-paiga-budget-peati-nirmichina-boxoffice-vadha-eantha-vasulu-chayasaro-telisthy-shock-avalasindhe5e51c2ae-c188-4273-8c09-34d293ea32f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ru-200-kotluku-paiga-budget-peati-nirmichina-boxoffice-vadha-eantha-vasulu-chayasaro-telisthy-shock-avalasindhe5e51c2ae-c188-4273-8c09-34d293ea32f0-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఒక మోస్తారు రూ.50 నుంచి రూ.60 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తుంటారు. కానీ కొంతమంది నిర్మాతలు ప్రెస్టీజియస్ గా తీసుకొని సుమారు రెండు వందల కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి సినిమాలు తీస్తున్న ప్రపంచం ఇది. అందులో కొన్ని దర్శకనిర్మాతలు కష్టపడి నిర్మిస్తే, మరికొన్ని రీమేక్ సినిమాలు. ఆ సినిమాలలో భారీ యాక్షన్,గ్రాఫిక్స్ లకే కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు కొన్ని సినిమాలు ఘనవిజయం gero,bhahubali,sohoo,darbar,saira,robo,eathagendha;ram charan teja;bhushan kumar;kumaar;rajinikanth;vijay crishna;abbas;ali;anand malayalam actor;jeevitha rajaseskhar;krishna;lyca productions;nayantara;ram pothineni;rajamouli;shankar;sujeeth;surender reddy;surya sivakumar;vijay;india;2019;cinema;telugu;murugadoss;bahubali;saaho;tamil;konidela production;2020;hindi;remake;graphics;saira narasimhareddy;a r murugadoss;darbar;joseph vijay;hindus;reddy;tiger zinda hai;anand deverakonda;zero;v;red;chitramరూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేశాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేశాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!gero,bhahubali,sohoo,darbar,saira,robo,eathagendha;ram charan teja;bhushan kumar;kumaar;rajinikanth;vijay crishna;abbas;ali;anand malayalam actor;jeevitha rajaseskhar;krishna;lyca productions;nayantara;ram pothineni;rajamouli;shankar;sujeeth;surender reddy;surya sivakumar;vijay;india;2019;cinema;telugu;murugadoss;bahubali;saaho;tamil;konidela production;2020;hindi;remake;graphics;saira narasimhareddy;a r murugadoss;darbar;joseph vijay;hindus;reddy;tiger zinda hai;anand deverakonda;zero;v;red;chitramSat, 02 Jan 2021 12:07:00 GMTసినీ ఇండస్ట్రీలో ఒక మోస్తారు రూ.50 నుంచి రూ.60 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తుంటారు. కానీ కొంతమంది నిర్మాతలు ప్రెస్టీజియస్ గా తీసుకొని సుమారు రెండు వందల కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి సినిమాలు తీస్తున్న ప్రపంచం ఇది. అందులో కొన్ని దర్శకనిర్మాతలు కష్టపడి నిర్మిస్తే, మరికొన్ని రీమేక్ సినిమాలు. ఆ సినిమాలలో భారీ యాక్షన్,గ్రాఫిక్స్ లకే కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు కొన్ని సినిమాలు ఘనవిజయం సాధించగా, మరి కొన్ని సినిమాలు పెట్టిన బడ్జెట్ కూడా రాని సందర్భాలు చాలా ఉన్నాయి.ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో చర్చించుకుందాం.

1. జీరో :
2018 లో హిందీలో విడుదలైన ఈ చిత్రానికి ఆనంద్  ఎ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో ఎల్లో కలర్ ప్రొడక్షన్స్ నిర్మించింది.ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్తో నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.191 కోట్లను మాత్రమే కలెక్షన్ చేసింది.

2.దర్బార్:
2020 వ సంవత్సరంలో తమిళ భాషలో విడుదలైన ఈ చిత్రానికి ఎ  ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా,లైకా ప్రొడక్షన్స్ పతాకంపై అల్లిరాజు సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార, నివేదాథామస్ ప్రత్యేక పాత్రలో నటించారు.ఈ చిత్రాన్ని  రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించగా 220 కోట్ల రూపాయల కలెక్షన్ జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా.

3. టైగర్ జిందా హై:
2017 వ సంవత్సరం లో హిందీ భాషలో  విడుదలైన ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని 2012లో వచ్చిన ఏక్తా టైగర్ సినిమా సీక్వెల్.ఈ చిత్రానికి 210 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగా,ప్రపంచ వ్యాప్తంగా రూ.565కోట్ల రూపాయలను వసూలు చేసింది.అప్పట్లో భారీ కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి సినిమాగా  కూడా ఈ సినిమా నిలిచింది.

4. పద్మావత్:
2018 సంవత్సరంలో హిందీ భాషలో విడుదలైన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాలో దీపికా పదుకొనే ప్రత్యేక పాత్రలో నటించారు.ఈ చిత్రానికి రెండు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి నిర్మించగా,ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసింది.

5. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్:
2018 సంవత్సరంలో హిందీలో విడుదలైన ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఆదిష్  చోప్రా తన బ్యానర్ యశ్రాజ్ ఫిలింస్ కింద నిర్మించారు. ఈ చిత్రానికి రెండు వందల ఇరవై కోట్లు అత్యంత బడ్జెట్ ను పెట్టి నిర్మించగా 330 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

6. బాహుబలి 2:
2017 లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి రూ.250 కోట్లు బడ్జెట్ పెట్టగా, రూ.1810 కోట్లను ఇప్పటి వరకు ఏ సినిమా సాధించలేని  కలెక్షన్లను ఈ ఒక్క సినిమా ద్వారా సాధించారు.

7. సైరా నరసింహరెడ్డి:
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి సూర్యుడు గా పిలువబడేఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. రూ.270 కోట్లు ఈ సినిమాకు బడ్జెట్ గా పెట్టగా, రూ.240 కోట్లతో సరిపెట్టుకుంది.

8.సాహో:
పాన్ ఇండియా మూవీగా  2019 లో విడుదలైన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా, వి. వంశీకృష్ణ రెడ్డితోపాటు ఉప్పలపాటి ప్రమోద్, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ చిత్రానికి రూ. 350 కోట్లు బడ్జెట్ పెట్టి, రూ. 435 కోట్లను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది.

9. రోబో 2.0
పాన్ ఇండియా మూవీగా  2018 లో విడుదలైన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా,  లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్  నిర్మించారు.రూ.570కోట్లు వెచ్చించగా రూ.800 కోట్లను వసూల్ చేసింది.


క‌రోనా రోగితో న‌ర్స్ శృంగారం... రోగి ఏం చేశాడంటే..!

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>