PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-thirupathi-with-robin-sharma-in-andhrapradesh-fa150838-fa50-4cae-9085-06045062da64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-thirupathi-with-robin-sharma-in-andhrapradesh-fa150838-fa50-4cae-9085-06045062da64-415x250-IndiaHerald.jpgనెల్లూరులో కీల‌క నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ ప్ర‌క‌టించిన ప‌ద‌వులు అందుకున్న వారు కూడా ఉన్నా రు. బీద ర‌విచంద్ర యాద‌వ్ వంటి యువ నాయ‌క‌త్వం కూడా ఉంది. కానీ.. ఎందుకో.. మౌనంగా ఉన్నారు. అయితే.. రెండు కార‌ణాలు వినిపిస్తున్నాయి. ఒక‌టి.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి హ‌వానే ఇంకా కొన‌సాగుతుండ‌డం వీరిలో చాలా మందికి ఇష్టం లేదు. దీనిని నేరుగా బ‌య‌ట‌కు చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. చంద్ర‌బాబే తెలుసుకుని పార్టీలో మార్పులు చేస్తారా? అంటే.. అది కూడా లేదు.tdp;lokesh;tiru;nara lokesh;nellore;mla;minister;letter;tdp;yuva;lokesh kanagaraj;reddy;dookudu;partyఅక్క‌డ టీడీపీని ఆ ఇద్ద‌రే బ్ర‌ష్టు ప‌ట్టించేశారా... బాబు వ‌దిలేస్తే అధోః గ‌తే..!అక్క‌డ టీడీపీని ఆ ఇద్ద‌రే బ్ర‌ష్టు ప‌ట్టించేశారా... బాబు వ‌దిలేస్తే అధోః గ‌తే..!tdp;lokesh;tiru;nara lokesh;nellore;mla;minister;letter;tdp;yuva;lokesh kanagaraj;reddy;dookudu;partySat, 02 Jan 2021 15:54:19 GMT``ఇటు మ‌మ్మ‌ల్న‌యినా.. ప‌నిచేసుకోనివ్వాలి. లేదా అటు వాళ్ల‌న‌యినా ప‌నిచేసుకోనివ్వాలి. రెంటికీ కాక‌పో తే.. ఎలా?``- ఇదీ.. ఇటీవ‌ల నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు త‌న మ‌న‌సులో మాట ‌ను బ‌య‌ట పెట్టారు. ప్ర‌స్తుతం నెల్లూరు టీడీపీలో ఒక విధ‌మైన స్త‌బ్ద‌త నెల‌కొంది. నాయ‌కులు ఉన్నా.. సీనియ‌ర్లు ఉన్నా.. ఎవ‌రూ పెద్ద‌గా ముందుకు రావ‌డం లేదు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం లేదు. ఒక‌వైపు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా లోకేష్ దూకుడుగా తిరుగుతున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

నెల్లూరులో కీల‌క నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ ప్ర‌క‌టించిన ప‌ద‌వులు అందుకున్న వారు కూడా ఉన్నా రు. బీద ర‌విచంద్ర యాద‌వ్ వంటి యువ నాయ‌క‌త్వం కూడా ఉంది. కానీ.. ఎందుకో.. మౌనంగా ఉన్నారు. అయితే.. రెండు కార‌ణాలు వినిపిస్తున్నాయి. ఒక‌టి.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి హ‌వానే ఇంకా కొన‌సాగుతుండ‌డం వీరిలో చాలా మందికి ఇష్టం లేదు. దీనిని నేరుగా బ‌య‌ట‌కు చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. చంద్ర‌బాబే తెలుసుకుని పార్టీలో మార్పులు చేస్తారా? అంటే.. అది కూడా లేదు.

ఇప్ప‌టికే పార్టీని అన్ని విధాలా భ్ర‌ష్టు ప‌ట్టించారంటూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తినా ప‌ట్టించుకోలేదు. పైగా ఏం జ‌రిగినా.. సోమిరెడ్డికే బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో... `ఇక‌ మేం ఎందుకు?` అనే మాట వినిపిస్తోంది. వ‌రుస‌గా విజ‌యం సాధించిన క‌మ్మ‌నేత‌లు ఉన్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు పార్టీలోకి వ‌చ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కానీ, పార్టీలో ఒక విధ‌మైన స్త‌బ్ద‌త కార‌ణంగా ఎవ‌రూ ముందుకు రాలేక పోతున్నారు. ఎవ‌రూ ప‌నిచేయ‌లేక పోతున్నారు.

ఇటు సిటీలో మైనార్టీ నేత అజీజ్‌, అటు జిల్లాలో సోమిరెడ్డి కార‌ణంగా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు మాజీ మంత్రి నారాయ‌ణ ఎక్క‌డ ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో నెల్లూరు టీడీపీని బాగు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


భార్యా భర్తల మధ్య గొడవ.. ముగ్గుర ప్రాణాల మీదకొచ్చింది..

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రంలోపు ఆపరేషన్

రికార్డులు బద్దలు కొడుతున్న ఆచార్య.. రిలీజ్‌కు ముందే ఇలా అయితే ఇక...

బుల్లిపిట్ట: స్కాన్ చేసి మనీ పే చేస్తున్నారా? అయితే ఇక నుంచి బాదుడే?

ఎఫ్3లో ముక్కు అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>