PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/empty-stomach7fa990b7-182a-4b62-9567-061c7cee7f38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/empty-stomach7fa990b7-182a-4b62-9567-061c7cee7f38-415x250-IndiaHerald.jpgసమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వలన చాలా మంది త్వరగా లావుగా అవుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉదయం అల్పాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగని ఏది పడితే అది తినకూడదు. ఒక క్రమ పద్దతిలో సరైన ఆహారం తీసుకుంటే మనం కోరుకున్న శరీరాకృతి మన సొంతమవుతుంది. అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఐదు ఫుడ్స్ మాత్రం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. empty stomach;ginger;red chilly powder;research and analysis wingబరువు తగ్గాలనుకునేవాళ్లు.. ఖాళీ కడుపుతో ఇవి తింటే డేంజరే..!?బరువు తగ్గాలనుకునేవాళ్లు.. ఖాళీ కడుపుతో ఇవి తింటే డేంజరే..!?empty stomach;ginger;red chilly powder;research and analysis wingSat, 02 Jan 2021 06:00:00 GMT
సాఫ్ట్ డ్రింక్స్.. ఉదయమే కాదు.. రోజులో ఎప్పుడు కూడా వీటిని తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు వైద్యులు. ఇందులో ఉండే co2 అధికంగా ఉంటుంది. అంతేగాక చక్కెర శాతం కూడా అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు సాఫ్ట్ డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సిట్రస్ పండ్లంటే పులుపుతో కూడుకున్నవి. ఉదాహరణకు నిమ్మ, నారింజ, ద్రాక్ష, బత్తాయి వంటివి. ఇందులో ఉండే అధిక ఆమ్లాలు .. కడుపుపై అదనపు భారాన్ని మోపుతాయట.

ఇక పొద్దున లేవగానే అందరూ చల్లటి నీళ్లు తాగాలని ఉబలాటపడతారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో కీడు చేస్తుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీటిని తీసుకోవాలి. నిమ్మరసం, అల్లంలో వేడి నీటిని కలుపుకుని తాగితే అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందే తప్ప కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కాదు. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అల్పాహారంలో కారంతో తయారుచేసిన పదార్థాలను అస్సలు ముట్టొద్దు. ఇవి తినడం వల్ల కడుపులో చాలా అసౌకర్యంగా ఉండటమే గాక.. ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల అది కొద్దిగంటలపాటు అది మనను కలవరపెట్టడం ఖాయం. పొద్దున పూట కారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముడి కూరగాయలు (రా వెజిటేబుల్స్).. అదేంటి..? అందరూ రా వెజిటేబుల్స్ ను తినమంటే మీరొద్దు అనుకుంటున్నారా..? ముడి కూరగాయలను ఉడికిచ్చి లేదా అలాగే తినడం మంచిదే కానీ ఖాళీ కడుపుతో మాత్రం తినొద్దట. అది జీర్ణవ్యవస్థమీద అదనపు భారాన్ని మోపుతుందట.

ఏదైనా తిన్న తర్వాత కొద్దిసేపటికి వాటిని తింటే ఉపయోగం ఉంటుందట. అయితే ముడి కూరగాయలు గానీ.. ఇతర పోషకాలు నిండిన పండ్లను గానీ తినడాని కంటే ముందు.. రాత్రి నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలు, బాదం, ఇతర గింజ పదార్థాలు తింటే మంచిదట. అందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవడమే గాక.. బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతాయట.


ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>