PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dead48f9d5ca-af38-4eec-996b-90fe7c8ec617-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dead48f9d5ca-af38-4eec-996b-90fe7c8ec617-415x250-IndiaHerald.jpgసమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ అధికారంతో రెచ్చిపోయాడు. ఓ పాన్ షాపు నిర్వాహకుడిని దారుణంగా కారుతో గుద్ది చంపేశాడు. షాపులో కొనుగోలు చేసిన సిగరేట్ ప్యాకేట్ కు డబ్బులు అడగడంతో ఆగ్రహానికి గురైన ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టారు.dead;kumaar;ajay;gourav;jeevan;praveen;uttarakhand;huzur nagar;police;car;police station;arrest;traffic police;local language;cigaretteవ్యక్తిని కారుతో గుద్ది చంపిన కానిస్టేబుల్.. ఎందుకంటే..!?వ్యక్తిని కారుతో గుద్ది చంపిన కానిస్టేబుల్.. ఎందుకంటే..!?dead;kumaar;ajay;gourav;jeevan;praveen;uttarakhand;huzur nagar;police;car;police station;arrest;traffic police;local language;cigaretteSat, 02 Jan 2021 08:00:00 GMTపోలీస్ కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టారు. కానిస్టేబుల్, అతని ఇద్దరు స్నేహితులు… కారుతో గుద్ది పాన్ షాపు యజమానిని చంపేశారు. ఈ షాకింగ్ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని బాజ్‌పూర్‌లో గౌరవ్ అనే వ్యక్తి పాన్ షాపు రన్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో..సిగరెట్లు కొనుక్కునేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్..తన బావమరిది,స్నేహితుడితో కలిసి గౌరవ్ షాప్ కి వెళ్లారు. ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని దానికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు కానిస్టేబుల్. దీంతో పాన్ షాపు నిర్వాహకుడు గౌరవ్..పోలీస్ కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే పొరుగున్న షాపులవాళ్లు కూడా అక్కడికి చేరుకుని..ఆ గొడవలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్, అతని ఇద్దరు స్నేహితులు తమ కారుతో పాన్ షాపు నిర్వాహకుడిని గుద్ది వెళ్లిపోయారు. తీవ్రగాయాలపాలైన పాన్ షాపు నిర్వాహకుడిని స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించి గురువారం బాజ్‌పూర్‌ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న కుమాన్ ఐజీ అజయ్ రౌతేలా సీరియస్ అయ్యారు. బాజ్‌పూర్‌ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్,మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. కానిస్టేబుల్ ప్రవీణ్, అతని స్నేహితులు గౌరవ్ రాథోడ్, జీవన్ పై ఐపీసీ 302, 504 మరియు 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకి ఆదేశించినట్లు సీనియర్ సూపరిండెంటెండ్ ఆఫ్ పోలీస్ దలీప్ సింగ్ తెలిపారు.


ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త ఏడాది కానుక.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..?

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>