PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tummala-nageswara-rao2ccb3685-d956-44e5-a9a3-93d7a4da0c1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tummala-nageswara-rao2ccb3685-d956-44e5-a9a3-93d7a4da0c1a-415x250-IndiaHerald.jpgవెళ్లిపోతారంటూ ఒక్క‌టే ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ ప్ర‌చారంపై నూత‌న సంవ‌త్స‌రం వేళ ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. స‌త్తుప‌ల్లిలో జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో తుమ్మ‌ల గంట పాటు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డంతో పాటు క్లారిటీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో కొంద‌రు స్వార్థ‌ప‌రులు మ‌న‌ల్ని కావాల‌నే ఓడించార‌ని.. గ‌తేడాది మ‌న‌కు ఏదీ క‌లిసి రాలేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అని.. తాను ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రానా కార్య‌క‌ర్త‌ల‌కు ఎప్పుడూ దూరం కాన‌ని.. కార్య‌క‌ర్త‌ల‌నtummala nageswara rao;kcr;ktr;district;minister;cheque;letter;reddy;party;santoshamపార్టీ మార్పుపై తుమ్మ‌ల సంచ‌ల‌నం... స‌త్తుప‌ల్లిలో భారీ స‌మావేశం..!పార్టీ మార్పుపై తుమ్మ‌ల సంచ‌ల‌నం... స‌త్తుప‌ల్లిలో భారీ స‌మావేశం..!tummala nageswara rao;kcr;ktr;district;minister;cheque;letter;reddy;party;santoshamSat, 02 Jan 2021 11:41:53 GMTజిల్లా రాజ‌కీయాల‌ను పార్టీల‌తో సంబంధం లేకుండా ద‌శాబ్దాల పాటు శాసిస్తూ వ‌స్తోన్న మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కొంత కాలంగా రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో వెన‌క‌ప‌డిపోయారు. చివ‌ర‌కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన పాలేరు కూడా ఆయ‌న్ను ఓడించిన కందాళ ఉపేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి రావ‌డంతో తుమ్మ‌ల‌కు పాలేరులోనూ ప్రాధాన్య‌త లేదు. పైగా జిల్లాకే చెందిన మంత్రి అజ‌య్ కేటీఆర్ అండ‌దండ‌ల‌తో తుమ్మ‌ల ప్రాభ‌వాన్ని పూర్తిగా తుడిచి వేసే చ‌ర్చ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే తుమ్మ‌ల పార్టీ మారిపోతార‌ని.. ఆయ‌న బీజేపీలోకి వెళ్లిపోతారంటూ ఒక్క‌టే ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ ప్ర‌చారంపై నూత‌న సంవ‌త్స‌రం వేళ ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. స‌త్తుప‌ల్లిలో జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో తుమ్మ‌ల గంట పాటు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డంతో పాటు క్లారిటీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో కొంద‌రు స్వార్థ‌ప‌రులు మ‌న‌ల్ని కావాల‌నే ఓడించార‌ని.. గ‌తేడాది మ‌న‌కు ఏదీ క‌లిసి రాలేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అని.. తాను ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రానా కార్య‌క‌ర్త‌ల‌కు ఎప్పుడూ దూరం కాన‌ని.. కార్య‌క‌ర్త‌ల‌ను తాను క‌డుపులో పెట్టుకుని చూసుకుంటాన‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొంత కాలం స‌ర్దుకు పోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న కోసం వేల మంది కార్య‌క‌ర్త‌లు రావ‌డం సంతోషంగా ఉంద‌న్న తుమ్మ‌ల‌.. కార్య‌క‌ర్త‌ల‌కు ఎప్పుడు ఏ ఇబ్బంది వ‌చ్చినా తాను అండ‌గా ఉంటాన‌ని చెప్పారు.

మ‌రికొంత కాలం పాటు మ‌న‌మంతా కేసీఆర్‌కు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా తుమ్మ‌ల కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ఏదేమైనా తుమ్మ‌ల పార్టీ మార్పు ప్ర‌చారం నేప‌థ్యంలో ఆయ‌న భావోద్వేగంతో కూడిన క్లారిటీ ఇవ్వ‌డం అనుచ‌రుల్లో ఉత్సాహం నింపింది. ఇక తుమ్మ‌ల కేసీఆర్ స‌న్నిహితుడినే అన్న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ కావడంతో ఆయ‌న పార్టీ మార్పు వార్త‌ల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌య్యింది.




కాలిఫోర్నియాలో 25వేల క‌రోనా మ‌ర‌ణాలు..వ‌ణికిపోతున్న జ‌నం..

తెలుగు సినిమా విడుదల కాకుండా అడ్డుకున్న దేశ ప్రధాని.. ఏ సినిమానో తెలుసా?

అలజడి రేపిన తెలంగాణా ఎమ్మెల్యే... రేవంత్ కి లైన్ క్లియర్ అవుతుందా...?

బట్టలు లేని వీడియోను పోస్ట్ చేసిన బిగ్‌బాస్ నటి

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>