PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-leaders-fires-on-chandrababu-vizianagaram-tour0dd2e69d-32c6-458f-837e-244adec48dfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-leaders-fires-on-chandrababu-vizianagaram-tour0dd2e69d-32c6-458f-837e-244adec48dfc-415x250-IndiaHerald.jpgవిజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిపక్ష నేత వెళ్లడంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసంపై ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్న ఈ సందర్భంలో చంద్రబాబు ప్రజల్ని రెచ్చ గొట్టేందుకే విజయనగరం వెళ్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే బాబు మాత్రం తాను వెళ్లాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఆలయాలపై దాడులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారాయన. chandrababu;lokesh;darshana;deva;bharatiya janata party;jagan;nara lokesh;vijayawada;janasena;chief minister;ycp;lokesh kanagaraj;janasena party;rama tirtha;yatra;simhadri;kaliచంద్రబాబు పర్యటనపై ఆందోళన..చంద్రబాబు పర్యటనపై ఆందోళన..chandrababu;lokesh;darshana;deva;bharatiya janata party;jagan;nara lokesh;vijayawada;janasena;chief minister;ycp;lokesh kanagaraj;janasena party;rama tirtha;yatra;simhadri;kaliSat, 02 Jan 2021 08:00:00 GMTవైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే బాబు మాత్రం తాను వెళ్లాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఆలయాలపై దాడులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారాయన.

వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజలకే కాదు, దేవుళ్ల విగ్రహాలకూ రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు చంద్రబాబు. దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాలకు, సంప్రదాయాలకు కళ్లెం పడిందని, రాష్ట్రంలో దేవుళ్ల విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్వేదిలో రథం తగులబెట్టిన నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదని, రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. సీసీ ఫుటేజీల్లో రికార్డయిన ఆధారాలను బయటపెట్టాలని కోరారు చంద్రబాబు.

రామతీర్థం సందర్శన యాత్రలో భాగంగా విజయవాడ గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు చంద్రబాబు మధ్యాహ్నం రామతీర్థం వెళ్లి.. కాలి నడకన కొండపైకి వెళ్లి దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని పరిశీలిస్తారు. అనంతరం అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్షనేత యాత్రను వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు విజయనగరం జిల్లాకు వస్తున్నారని, అసలీ కుట్రకు ఆయనే కారణమంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. అటు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. మొత్తమ్మీద చంద్రబాబు విజయనగరం యాత్ర రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింతగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు బీజేపీ, జనసేన కూడా ఇదే విషయమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. 


తృణ‌మూల్ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు... మ‌ళ్లీ ఏం జరిగిందో తెలుసా..

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>