MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-mahesh-babu-behaviorbe982785-0c3b-45e5-b99e-83399967f5c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-mahesh-babu-behaviorbe982785-0c3b-45e5-b99e-83399967f5c8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి రెండో తనయుడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నీడ సినిమా ద్వారా బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత పలు సినిమాలు చేసి చిన్నతనంలోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అభిమానులను అలరించారు. ఆపై కెరీర్ పరంగా కొంత విరామం తీసుకున్న మహేష్, చదువు పూర్తి చేసి రాజకుమారుడు సినిమా తో 1999లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.superstar mahesh babu;sarkaru vaari paata;mahesh;prabhas;krishna;india;rajaka;tollywood;cinema;rajani kanth;media;producer;industry;blockbuster hit;producer1;success;international;joshపిచ్చెక్కిస్తున్న మహేష్ మేనియా .... ఆయనే టాప్... ఇదే ప్రూఫ్ ...??పిచ్చెక్కిస్తున్న మహేష్ మేనియా .... ఆయనే టాప్... ఇదే ప్రూఫ్ ...??superstar mahesh babu;sarkaru vaari paata;mahesh;prabhas;krishna;india;rajaka;tollywood;cinema;rajani kanth;media;producer;industry;blockbuster hit;producer1;success;international;joshFri, 01 Jan 2021 21:25:10 GMTటాలీవుడ్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి రెండో తనయుడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నీడ సినిమా ద్వారా బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత పలు సినిమాలు చేసి చిన్నతనంలోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అభిమానులను అలరించారు. ఆపై కెరీర్ పరంగా కొంత విరామం తీసుకున్న మహేష్, చదువు పూర్తి చేసి రాజకుమారుడు సినిమా తో 1999లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకొని పలు రికార్డులు నమోదు చేసింది. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 26 సినిమాలు చేశారు. ఆ విధంగా అనతికాలంలోనే కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకని తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్నారు మహేష్. ఇక ఇటీవల వరుసగా మూడు హిట్స్ అందుకని కెరీర్ పరంగా హ్యాట్రిక్ నమోదు చేసి మంచి జోష్ మీద ఉన్న సూపర్ స్టార్ అతి త్వరలో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు గురించి ఒక వార్త ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో సంచలనంగా మారింది.

అదేమిటంటే ఈ సినిమా కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ దాదాపు రూ.70 కోట్ల వరకు ఉందని అయితే రెమ్యునరేషన్ రూపంలో దాదాపు రూ.55 కోట్ల వరకు తీసుకుంటున్న మహేష్ బాబు ఆపై సినిమాలోనే లాభాల్లో 20 శాతం వరకు వాటా తీసుకుంటున్నారని మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకు ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో భారీ మొత్తంలో ఉందని అంటున్నారు. టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తప్పించి మరొకటి నటుడు ఎవరూ కూడా ఇంత భారీ స్థాయిలో తీసుకోవటం లేదని ఆ విధంగా టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త బెంచ్ మార్కును సృష్టించారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి సినిమా సినిమాతో మహేష్ క్రేజ్ పెరిగిపోతుందని అలానే ఆయన మేనియా పలు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతోందని ఇక రాబోయే రోజుల్లో రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా సినిమా అనంతరం మహేష్ బాబు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా దూసుకెళ్లే అవకాశం కూడా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.....!!


సమంతకు మరో లక్కీ ఛాన్స్.. శాకుంతలంలో ఆమె ఫిక్స్..!

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>