PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/therefore-an-order-of-83-crore-syringes34f058c2-06d5-406a-9678-a7eb3edfbb77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/therefore-an-order-of-83-crore-syringes34f058c2-06d5-406a-9678-a7eb3edfbb77-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ తయారీ.. చివరి దశకు చేరుకోవడంతో పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా ఇప్పటికే.. పలు రాష్ట్రాల్లో డ్రై రన్‌ నిర్వహించిన కేంద్రం.. ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా డ్రై రన్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేసేందుకు ఈ డ్రైన్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ డ్రై ర‌న్ నిర్వహించ‌నున్నారు. దేశంలో కోవిడ్‌ టీకా పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్రం. అతి త్వరలో కోవిడ్ టీకాకు భార‌త ప్రభుత్వం ఆtherefore an order of 83 crore syringes;district;central government;kshanamఅందుకోసం 83కోట్ల సిరంజీల ఆర్డర్..!అందుకోసం 83కోట్ల సిరంజీల ఆర్డర్..!therefore an order of 83 crore syringes;district;central government;kshanamFri, 01 Jan 2021 15:00:00 GMTకేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా ఇప్పటికే.. పలు రాష్ట్రాల్లో డ్రై రన్‌ నిర్వహించిన కేంద్రం.. ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా డ్రై రన్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేసేందుకు ఈ డ్రైన్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ డ్రై ర‌న్ నిర్వహించ‌నున్నారు.

దేశంలో కోవిడ్‌ టీకా పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్రం. అతి త్వరలో కోవిడ్ టీకాకు భార‌త ప్రభుత్వం ఆమోదం తెలిపే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 28, 29 తేదీల్లో.. నాలుగు రాష్ట్రాల్లో డ్రై ర‌న్ ఏర్పాటు చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ.. ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సమాచారం అందించింది.

వ్యాక్సినేష‌న్ ల‌క్ష్యాల‌ను అందుకునేందుకు అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాల‌ని త‌న ఆదేశాల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. జ‌న‌వ‌రి రెండ‌వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు డ్రైన్ ర‌న్ నిర్వహిస్తాయ‌ని, ఆయా రాష్ట్రాల రాజ‌ధానుల్లో క‌నీసం మూడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లోనూ టీకా పంపిణీ చేయ‌నున్నారు.

డ్రై ర‌న్‌ లో భాగంగా.. డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్‌ వచ్చాక  పంపిణీ కార్యక్రమంలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ఈ రన్‌ తోడ్పడుతుంది. అందుకే, ప్రివ్యూ మాదిరిగా.. ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణంలో అయినా.. దేశంలో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మ‌రో వైపు వ్యాక్సినేష‌న్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 83 కోట్ల సిరంజీల‌కు ఆర్డర్‌ చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. అద‌నంగా మ‌రో 35 కోట్ల సిరంజీల కోసమూ బిడ్స్ దాఖ‌లు చేసింది కేంద్రం.






మీకు ఎక్కువగా జుట్టు రాలుతోందా ?అయితే ఈ 7 చిట్కాలు పాటిస్తే సరిపోద్దీ !

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>