PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ganta-srinivasarao-versus-avanthi-srinivas-in-vizag-politics771452ba-752a-4486-859c-4bd6e78772fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ganta-srinivasarao-versus-avanthi-srinivas-in-vizag-politics771452ba-752a-4486-859c-4bd6e78772fa-415x250-IndiaHerald.jpgవైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నం వేదికగా రాజకీయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకురావడం, అందులో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా ముందుకెళుతుండటంతో, విశాఖ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హైలైట్ అయ్యింది. దీంతో విశాఖలో వైసీపీ మరింత బలపడటం జరుగుతుంది. ganta srinivasarao;view;mithra;srinivas;jagan;v vijayasai reddy;andhra pradesh;2019;avanthi srinivas;vishakapatnam;government;capital;minister;war;tdp;ycp;reddy;bheemili;partyఅవంతి వర్సెస్ గంటా: ఊహించని మలుపు తిరిగిన విశాఖ పాలిటిక్స్...!అవంతి వర్సెస్ గంటా: ఊహించని మలుపు తిరిగిన విశాఖ పాలిటిక్స్...!ganta srinivasarao;view;mithra;srinivas;jagan;v vijayasai reddy;andhra pradesh;2019;avanthi srinivas;vishakapatnam;government;capital;minister;war;tdp;ycp;reddy;bheemili;partyFri, 01 Jan 2021 01:00:00 GMTవైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నం వేదికగా రాజకీయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకురావడం, అందులో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా ముందుకెళుతుండటంతో, విశాఖ ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హైలైట్ అయ్యింది. దీంతో విశాఖలో వైసీపీ మరింత బలపడటం జరుగుతుంది.

అదే సమయంలో జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని చంద్రబాబు డిమాండ్ చేస్తుండటంతో, విశాఖలో టీడీపీ వీక్ అవ్వడం మొదలైంది. ఇప్పటికే పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లారు. అయితే విశాఖలో టీడీపీకి స్ట్రాంగ్ నాయకుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావు సైతం వైసీపీలోకి వెళ్ళడం ఖాయమైందని ప్రచారం జరిగింది.
మొదట నుంచి గంటా వైసీపీలోకి వెళ్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గంటా ఇంతవరకు పార్టీ జంప్ చేసే కార్యక్రమం చేయలేదు.

అయితే వైసీపీలో ఉన్న తన మాజీ మిత్రుడు, మంత్రి అవంతి శ్రీనివాస్, గంటాని రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల ముందు వరకు అవంతి, గంటాలు టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా నడుచుకున్నారు. అయితే ఎన్నికల ముందు అవంతి టీడీపీని వీడి, వైసీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, మంత్రి కూడా అయ్యారు.

ఇక ఇక్కడ నుంచే విశాఖ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి తర్వాత అవంతి పెద్ద నాయకుడుగా చెలామణి అవుతున్నారు. అలాగే గంటా వైసీపీలోకి వస్తే తన అధిపత్యానికి గండిపడుతుందనే ఉద్దేశంతో, ఆయన్ని పార్టీలోకి రానివ్వడం లేదనే టాక్ వస్తుంది. అయితే గంటా సైతం ఇటీవల టీడీపీలో యాక్టివ్ అయ్యారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించే దిశగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. అలాగే నెక్స్ట్ అవంతిని ఎలాగైనా ఓడించాలని గంటా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. పైగా గంటాకు భీమిలిపై పట్టు ఉంది. కానీ ప్రస్తుతానికైతే భీమిలిలో అవంతి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. మొత్తానికైతే గంటా, అవంతిల మధ్య సైలెంట్ వార్ జరుగుతున్నట్లే కనిపిస్తోంది.




ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>