PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/fear-with-that-new-virus-corona984bf3a3-db43-4f94-be02-d27c814b729c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/fear-with-that-new-virus-corona984bf3a3-db43-4f94-be02-d27c814b729c-415x250-IndiaHerald.jpgసూర్యా‌పేట సంఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో గ‌ణ‌నీయంగా కేసుల సంఖ్య త‌గ్గిపోవ‌డంతో ఇక క‌రోనా పీడ విరుగ‌డైంద‌ని సంబురం ప‌డుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా పిడుగులాంటి వార్త వినిపించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి గేటెడ్‌ కమ్యూనిటీలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా సోకింది. సూర్యాపేట పట్టణంలో యాదాద్రి టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో ఇటీవల ఒకరు మృతిచెందారు. ఆయన అంత్యక్రియలకు వందలాది మంది బంధువులు హాజరయ్యారు. అయితే మృతిచెందిన వ్యక్తి కుమారుడికి తంcorona;telangana;mohandas karamchand gandhi;district;huzur nagar;suryapeta;survey;yadadri;central government;father;mahabubnagar;nampallyసూర్యా‌పేట‌లో ఒకే కుటుంబంలో 22మందికి క‌రోనా... ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసాసూర్యా‌పేట‌లో ఒకే కుటుంబంలో 22మందికి క‌రోనా... ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసాcorona;telangana;mohandas karamchand gandhi;district;huzur nagar;suryapeta;survey;yadadri;central government;father;mahabubnagar;nampallyFri, 01 Jan 2021 18:48:00 GMTతెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో గ‌ణ‌నీయంగా కేసుల సంఖ్య త‌గ్గిపోవ‌డంతో ఇక క‌రోనా పీడ విరుగ‌డైంద‌ని సంబురం ప‌డుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా పిడుగులాంటి వార్త వినిపించింది.  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి గేటెడ్‌ కమ్యూనిటీలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా సోకింది. సూర్యాపేట పట్టణంలో యాదాద్రి టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో ఇటీవల ఒకరు మృతిచెందారు. ఆయన అంత్యక్రియలకు వందలాది మంది బంధువులు హాజరయ్యారు. అయితే మృతిచెందిన వ్యక్తి కుమారుడికి తండ్రి అంత్యక్రియల అనంతరం కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు కొవిడ్ పరీక్షలు చేయించడంతో 22 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.


ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. సూర్యాపేట డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ సిబ్బంది యాదాద్రి టౌన్ షిప్ లో సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి కరోనా టెస్టులు చేసేందుకు వైద్యశాఖ సిద్ధమవుతోంది. ఈ విషయంపై డీఎంహెచ్‌వో డా.హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. కరోనా సోకిన 22 మందిలో ఎవరికీ స్ర్టెయిన్‌ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు హాజరై తదుపరి కార్యక్రమాలకు ఒకే ఇంట్లో నివాసం ఉన్న సమీప బంధువులకే వైరస్‌ సోకినట్లు గుర్తించామన్నారు. ప్రత్యేక వైద్యబృందం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.


రాష్ట్రంలో సెకండ్ వేవ్ లేద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన ఇంత‌మందికి క‌రోనా సోక‌డంతో జ‌నాలు వ‌ణికిపోతున్నారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో రేపు జరగనున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో డ్రైరన్‌ చేపట్టనునున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్‌సీ, సోమాజిగూడ యశోద ఆస్పత్రుల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు. అలాగే మహబూబర్‌నగర్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్‌సీ, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డ్రైరన్‌ చేపట్టనున్నారు.






కొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>