Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/team-indiab05351f2-bfb6-4482-aabc-411587d12905-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/team-indiab05351f2-bfb6-4482-aabc-411587d12905-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టెస్ట్ స్పెషలిస్ట్ పేసర్ ఉమేశ్ యాదవ్ పిక్క గాయంతో జట్టుకు దూరయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఇప్పుడు యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల్లో కట్టుదిట్టంగా...team india;karthik;rohit;mumbai;virat kohli;india;bcci;letter;yuva;ravi shastri;father;kaliమూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్team india;karthik;rohit;mumbai;virat kohli;india;bcci;letter;yuva;ravi shastri;father;kaliFri, 01 Jan 2021 07:36:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టెస్ట్ స్పెషలిస్ట్ పేసర్ ఉమేశ్ యాదవ్ పిక్క గాయంతో జట్టుకు దూరయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఇప్పుడు యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్ రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా పిక్క గాయంతో బాధపడ్డాడు. వెంటనే జట్టు వైద్య సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే అప్పటికి ఉమేశ్ కేవలం 3.3 ఓవర్లు మాత్రమే వేసి ఓపెనర్ జో బర్న్స్ రూపంలో ఓ వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే నాలుగో ఓవర్ మూడో బంతి వేసినప్పుడు అతడి కాలు కొద్దిగా జారింది. దీంతో బాధతో విలవిల్లాడిపోయిన ఉమేశ్ వెంటనే మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు.

పిక్క గాయం కారణంగా ఉమేశ్ జట్టునుంచి తప్పుకోవడంతో యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు ఆ చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమేశ్ యాదవ్‌ బదులు రీప్లేస్‌మెంట్‌గా తీసుకోవడానికి ప్రస్తుతం టీమిండియాకు కనిపిస్తున్న ఏకైన ఆప్షన్ అతడే కావడంతో అతడినే తుది జట్టులోకి తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే ప్రస్తుతం భారత నెట్ బౌలర్లుగా టీ నటరాజన్, కార్తిక్ త్యాగిలు ఉన్నారు. వీరిలో ఎవరినైనా రీప్లేస్‌మెంట్ తీసుకుంటారా..? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ‘శార్దూల్ ముంబై దేశవాళీ జట్టుల్లో రెగ్యులర్‌ బౌలర్‌గా ఉన్నాడు. వెస్టిండీస్‌తో తన అరంగేట్ర టెస్టులో దురదృష్టవశాత్తూ అతను కనీసం రెండు ఓవర్లయినా పూర్తి చేయకముందే గాయంతో మైదానం వీడాడు. ఆ తర్వాత మరింత మెరుగయ్యాడు. మూడో టెస్టులో అతనాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కోచ్‌ రవిశాస్త్రి, తాత్కాలిక కెప్టెన్‌ రహానె, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ కలిసి తుది నిర్ణయం తీసుకుంటార’ని బీసీసీఐ చెబుతోంది. ఒకవేళ తుది జట్టులో శార్దూల్‌కు చోటు దక్కితే ఏ మాత్రం సత్తా చాటుతాడో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఆసీస్ టూర్‌లో భారత్ జట్టును గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. తండ్రి కాబోతున్న నేపథ్యంలో కోహ్లీ భారత్ తిరిగి వచ్చేయడం, స్టార్ పేసర్ మహ్మద్ షమి చేతి గాయంతో జట్టుకు దూరం కావడం, ఇప్పుడు ఉమేశ్ కూడా కాలి గాయంతో జట్టులో స్థానం కోల్పోవడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికంటే ముందే టెస్ట్ స్పెషలిస్ట్ పేసర్ ఇశాంత్ శర్మ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మలు ఫిట్ నెస్ కారణంగా తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్ మూడో టెస్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>