PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi6fcdbe19-5182-425b-8d2d-1394d9ff50c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi6fcdbe19-5182-425b-8d2d-1394d9ff50c0-415x250-IndiaHerald.jpgనూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు సందేశమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కరోనావైరస్‌కు టీకాలు వచ్చిన జాగ్రత్తలు పాటించడాన్ని మరువరాదని ఆయన పిలుపునిచ్చారు. మందులతోపాటే జాగ్రత్తలూ పాటించడమే నూతన సంవత్సరంలో మనం పాటించాల్సిన మంత్రంమని ప్రధాని చెప్పారు. కరోనాకు చికిత్స, టీకాలతో కొత్త ఏడాది సరికొత్త ఆశలతో ఆహ్వానిస్తున్నది అని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు.narendra modi;koti;modi;sampada;india;mandula;narendra modi;prime minister;2020;cheque;central government;maha;mantra;narendraమందులతోపాటే జాగ్రత్తలూ! ప్రధాని మోడీ కొత్త సందేశంమందులతోపాటే జాగ్రత్తలూ! ప్రధాని మోడీ కొత్త సందేశంnarendra modi;koti;modi;sampada;india;mandula;narendra modi;prime minister;2020;cheque;central government;maha;mantra;narendraFri, 01 Jan 2021 09:54:03 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ.  కరోనావైరస్‌కు టీకాలు వచ్చిన జాగ్రత్తలు పాటించడాన్ని మరువరాదని ఆయన పిలుపునిచ్చారు. మందులతోపాటే జాగ్రత్తలూ పాటించడమే నూతన సంవత్సరంలో మనం పాటించాల్సిన మంత్రంమని ప్రధాని చెప్పారు. కరోనాకు చికిత్స, టీకాలతో కొత్త ఏడాది సరికొత్త ఆశలతో ఆహ్వానిస్తున్నది అని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సందేశమిచ్చారు.

           ‘గతంలో కరోనాకు టీకా వచ్చే వరకు నిర్లక్ష్యం, అజాగ్రత్తలు వద్దని ఎప్పుడూ చెబుతుండేవాణ్ణి. కానీ, 2021 మంత్రం ఏంటంటే.. ‘మందులున్నాయి. జాగ్రత్తలూ ఉంటాయి.’ ‘2020 సంవత్సరం ‘ఆరోగ్యమే మహా సంపద’ అనే పాఠాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసింది. అనేక సవాళ్లను మనముందుంచింది. ఈ ఏడాది చివరి రోజున కరోనా యోధులను గుర్తుచేసుకోవడం సముచితం. కరోనా యోధులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
 
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను భారత్ నిర్వహించనుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ బృహత్కార్యానికి సర్వం సంసిద్ధం చేస్తున్నామని వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించినట్టుగానే టీకా కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. దాదాపు కోటి మంది కరోనా నుంచి రికవరీ అయ్యారని, రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. 2021 సంవత్సరం కొత్త ఆశలతో వస్తున్నదని తెలిపారు. ‘మన దేశంలో వదంతులు వేగంగా వ్యాపిస్తాయి. కొందరు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మరికొందరు బాధ్యతారాహిత్యంగా వదంతులు, అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. కరోనా టీకా కార్యక్రమంపైనా అసత్య ప్రచారాలు, పుకార్లు రావచ్చు. కొందరు ఇప్పటికే మొదలుపెట్టారు కూడా. కాబట్టి, దేశ ప్రజలు వదంతులపట్లా జాగరూకతతో మెలగాలి. సోషల్ మీడియాలోనూ నిర్లక్ష్యంగా మెస్సేజీలు ఫార్వర్డ్ చేయరాదు. చెక్ చేసుకునే ఇతరులకు సందేశాలు పంపాలి. ఆరోగ్యపరంగా భారత్ పాత్రను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. ఇప్పటికే భారత్ ప్రపంచానికే కేంద్రంగా ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.








అమితాబ్ సినిమా కోసం రష్మిక అంత తీసుకుంటోందా..!?

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

‘నిర్ణయం మార్చుకుంటారా..? లేదా..’ అంటూ రజనీకాంత్ ఇంటి ఎదుట అభిమాని ఆత్మహత్యాయత్నం

'మహర్షి'గా మారిన వార్నర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>