PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/priyaprakashvarrierb8442215-5fcf-4c87-81da-ba377d05abed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/priyaprakashvarrierb8442215-5fcf-4c87-81da-ba377d05abed-415x250-IndiaHerald.jpgఒక్కసారి కన్నుకొట్టి దేశం మొత్తాన్ని ప్రేమలో పడేలా చేసింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్. ఈ‌ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది 'ఒరు ఆడార్‌ లవ్‌' చిత్రంలో ఆమె కన్ను కొట్టిన సీనే‌. ఆ ఒకే ఒక సీన్‌ ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసేసింది. ఒకానొక సందర్భంలో దర్శక నిర్మాతలు ఆమె పేరు తెగ జపం చేశారు కూడా.priyaprakashvarrier;priya;geetha;rani;tiru;variar;cinema;sangeetha;telugu;kannada;thota chandrasekhar;chitramకన్నుకొట్టి మనసు దోచుకున్న ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో ట్యాలెంట్‌తో..కన్నుకొట్టి మనసు దోచుకున్న ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో ట్యాలెంట్‌తో..priyaprakashvarrier;priya;geetha;rani;tiru;variar;cinema;sangeetha;telugu;kannada;thota chandrasekhar;chitramFri, 01 Jan 2021 19:50:14 GMTతిరువనంతపురం : ఒక్కసారి కన్నుకొట్టి దేశం మొత్తాన్ని ప్రేమలో పడేలా చేసింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్. ఈ‌ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది 'ఒరు ఆడార్‌ లవ్‌' చిత్రంలో ఆమె  కన్ను కొట్టిన సీనే‌. ఆ ఒకే ఒక సీన్‌ ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసేసింది. ఒకానొక సందర్భంలో దర్శక నిర్మాతలు ఆమె పేరు తెగ జపం చేశారు కూడా. అయితే 'ఒరు ఆడార్‌ లవ్‌' ప్లాప్‌ అయింది. దీంతో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కు పెద్దగా అవకాశాలు దక్కకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగులో నితిన్‌, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'చెక్‌' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌ గా ప్రియ నటిస్తోంది. హీరోయిన్‌ గా పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో తనలోని కొత్త టాలెంట్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెగ ప్రయత్నాలు చేస్తోంది.

దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ సింగర్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకునే పనిలో చాలా బిజీగా ఉందని సమాచారం. ఇప్పటికే మలయాళం, కన్నడ భాషల్లో పాటలు పాడిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. రీసెంట్‌గా తెలుగులోనూ పాటలు పాడేందుకు ముందుకు వచ్చిందట. శ్రీచరణ్‌ పాకాల సంగీత సారథ్యం వహించిన ఓ ప్రైవేట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్ ‌లో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పాట పాడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తన నటనను పక్కన పెట్టి కొత్త దారిలోకి వచ్చిన ఆమెకు ఈ రంగం ఎలా కలిసొస్తుందో చూడాలి మరి. యాక్టర్ గా వేసిన తొలి అడుగు విఫలమైనా పట్టుదలతో మరో రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ కు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి ప్రోత్సహిద్దాం. ఇలాగైనా మరి ఇండస్ట్రీలో కెరీర్ ను ఆమ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.


కొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>