SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsddbd65f0-e135-4feb-9d84-44013f106c03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsddbd65f0-e135-4feb-9d84-44013f106c03-415x250-IndiaHerald.jpg2020 కరోనాతో క్రికెట్ కు చాలా పెద్ద దేబ్బే అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియా చాలా పర్యటనలు వాయిదా పడ్డాయి. అరకొర మ్యాచ్ లు తప్ప ఫుల్ మిల్స్ లాంటి మ్యాచ్ మ్యాచ్ లు జరగలేదనే చెప్పాలి. ఐ‌పి‌ఎల్ అంటేనే సిసలైన క్రికెట్ మజా కు పెట్టింది పేరు.అటువంటి ఐ‌పి‌ఎల్ స్వదేశం లో కాకుండా అరబ్ దేశాల్లో నిర్వహించారు. అంతే కాకుండా కరోనా కారణంగా ఐ‌పి‌ఎల్ మజా మిస్ అయ్యిందనే చెప్పాలి. అయితే కరోనా కారణంగా 2020లో తక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకు 2021లో ఎడతెరిపిలేని షెడ్యూల్‌ తో క్రికెట్ అభిమానులకి వినోదాన్ని పంచనుంది. sports news;cricket;india;january;2020;february;letter;qualification;international;april;marchస్పొర్ట్స్ : 2021 లో టీమిండియా కు తీరిక లేదుగా !!స్పొర్ట్స్ : 2021 లో టీమిండియా కు తీరిక లేదుగా !!sports news;cricket;india;january;2020;february;letter;qualification;international;april;marchFri, 01 Jan 2021 08:00:00 GMT2020 కరోనాతో క్రికెట్ కు చాలా పెద్ద దేబ్బే అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియా చాలా పర్యటనలు వాయిదా పడ్డాయి. అరకొర మ్యాచ్ లు తప్ప ఫుల్ మిల్స్ లాంటి మ్యాచ్ మ్యాచ్ లు జరగలేదనే చెప్పాలి. ఐ‌పి‌ఎల్ అంటేనే సిసలైన క్రికెట్ మజా కు పెట్టింది పేరు.అటువంటి ఐ‌పి‌ఎల్ స్వదేశం లో కాకుండా అరబ్ దేశాల్లో నిర్వహించారు. అంతే కాకుండా కరోనా కారణంగా ఐ‌పి‌ఎల్ మజా మిస్ అయ్యిందనే చెప్పాలి. అయితే కరోనా కారణంగా 2020లో తక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకు 2021లో ఎడతెరిపిలేని షెడ్యూల్‌ తో క్రికెట్ అభిమానులకి వినోదాన్ని పంచనుంది.

ప్రస్తుతం ఆ్రస్టేలియాలో ఉన్న భారత్‌ సిడ్నీలో జనవరి 7 నుంచి మూడో టెస్టు... జనవరి 15 నుంచి చివరిదైన నాలుగో టెస్టు ఆడుతుంది. ఆ్రస్టేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాక తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 4 టెస్టులు, 5 టి20 మ్యాచ్‌లు, 3 వన్డేలు జరుగుతాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన వెంటనే ఏప్రిల్‌–మే నెలల్లో ఐపీఎల్‌ తో సందడి చెయ్యనుంది. ఇది ముగిశాక... ఒకవేళ భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తే జూన్‌లో ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ మైదానంలో ఫైనల్‌ ఆడేందుకు వెళ్లాల్సి ఉంటుంది.

అనంతరం ఆగస్టులో ఈసారి ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టులు జరుగుతాయి. సెప్టెంబర్‌ చివరి వారంలో ఆసియా కప్‌ టోర్నమెంట్‌... అక్టోబర్‌–నవంబర్‌లలో స్వదేశంలో టి20 వరల్డ్‌కప్‌లో భారత్‌ బరిలోకి దిగనుంది. నవంబర్‌లో టి20 ప్రపంచకప్‌ ముగిశాక భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళుతుంది. అక్కడ సఫారీ జట్టుతో మూడు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ఈ విధంగా క్షణం తీరిక లేని సెడ్యూల్డ్ తో 2020 లో మిస్ అయిన క్రికెట్ మజా ను 2021 పూర్తి స్థాయి అందించనున్నట్టు తెలుస్తుంది.   


ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>