SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/panughnatif25949bc-6a14-4606-9c5e-349466bd8673-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/panughnatif25949bc-6a14-4606-9c5e-349466bd8673-415x250-IndiaHerald.jpgతెలుగు స‌మాజాన్ని ఆలోచింప‌జేసే ర‌చ‌న‌లు చేశారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు. వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత పెద్దాపురం హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవమpanughnati;purnima;richard;vani;history;november;lakshmi devi;ayurveda;father;vemuri radhakrishna;sakshi;rajahmundryహెరాల్డ్ స్మ‌రామీ : ఆంధ్రా షేక్‌స్పియ‌ర్ పానుగంటి ల‌క్ష్మీన‌ర‌సింహ‌రావు..హెరాల్డ్ స్మ‌రామీ : ఆంధ్రా షేక్‌స్పియ‌ర్ పానుగంటి ల‌క్ష్మీన‌ర‌సింహ‌రావు..panughnati;purnima;richard;vani;history;november;lakshmi devi;ayurveda;father;vemuri radhakrishna;sakshi;rajahmundryFri, 01 Jan 2021 12:39:53 GMTలక్ష్మీ నరసింహారావు. 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు. వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత పెద్దాపురం హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి వంటి ర‌చ‌న‌లు ఆయ‌న‌కు ఎంత‌గానో పేరు తీసుకువ‌చ్చాయి.


వాస్త‌వానికి సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో రాశారు. తెలుగు మాతృభాష గల వారు కూడ అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనే రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసినస్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.


సామాజిక రుగ్మతలను ఎండగడుతూ ఆయన రాసిన సాక్షి వ్యాసాలు తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన రాసిన నాటకాలు కూడా ఆనాటి సాహితీ అభిమానుల ఆదరణను పొందాయి. " పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి.. ఎంచేతనంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి రూపాన్నియ్యడం నేనుగంటి" అని శ్రీశ్రీ సైతం కొనియాడిన మేటి సాహితీ శిఖరం పానుగంటి. రచనల వలన విశేషంగా డబ్బు సంపాదించినా  నిల్వ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో చివ‌రి రోజుల్లో ఆయ‌న పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. అక్టోబరు 7న, 1940లో మరణించారు.













క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>