PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjala-ramakrishna-reddy28c99076-0eea-4332-9477-0e329a0c4d93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjala-ramakrishna-reddy28c99076-0eea-4332-9477-0e329a0c4d93-415x250-IndiaHerald.jpgచంద్రబాబు దార్శనికత దురదృష్టం అయితే.. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి దార్శనికత ఒక అదృష్టమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎందుకూ పనికిరాని ఒక విజన్ ద్వారా చంద్రబాబు ప్రజలను భ్రమపెట్టారని ఆయన దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మన రాష్ట్రం సమర్థంగా పనిచేసిందని స్పష్టం చేశారు. sajjala ramakrishna reddy;amala akkineni;editor mohan;jagan;2019;media;chief minister;central government;sv mohan reddy;reddy;party;sajjala ramakrishna reddyచంద్రబాబు దార్శనికత దురదృష్టం: సజ్జల రామకృష్ణా రెడ్డిచంద్రబాబు దార్శనికత దురదృష్టం: సజ్జల రామకృష్ణా రెడ్డిsajjala ramakrishna reddy;amala akkineni;editor mohan;jagan;2019;media;chief minister;central government;sv mohan reddy;reddy;party;sajjala ramakrishna reddyFri, 01 Jan 2021 18:04:38 GMTజగన్ మోహన్ రెడ్డి దార్శనికత ఒక అదృష్టమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎందుకూ పనికిరాని ఒక విజన్ ద్వారా చంద్రబాబు ప్రజలను భ్రమపెట్టారని ఆయన దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మన రాష్ట్రం సమర్థంగా పనిచేసిందని స్పష్టం చేశారు.
                      ఆ రోజు దివంగత మహానేత వైఎస్సార్‌పై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసి ప్రచారం చేశారని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే ఏమిటో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు తెలిసిందని రామకృష్ణా రెడ్డి చెప్పారు. వైఎస్‌ జగన్ విషయంలోనూ అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారు. 2019 తీర్పు చూస్తే విశ్వనీయతకు పట్టం కట్టి వారి అబద్దాలను ప్రజలు తిప్పికొట్టారు. ఈ ఏడాదిన్నరలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. సంక్షేమాలు అమలు చేశారన్నారు. అదే చంద్రబాబు అయితే అధికారికంగా చేతులెత్తేసే వారని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో దాన్ని నిలబెట్టేందుకు వైఎస్‌ జగన్ విశేష కృషి చేశారని స్పష్టం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన తీరు దేశంలో ఎప్పుడూ లేదన్నారు. యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని, ఈ యజ్ఞం ద్వారా నిజమైన మహిళా సాధికారతకు దారి తీసిందన్నారు. ఇలాంటిది చంద్రబాబు ఎందుకు చేయలేదు..? ఆయన ఆలోచన ధోరణి వేరు. అధికారం తన చేతిలో కానీ, పార్టీ చేతిలో కాకుండా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్‌దని కొనియాడారు.
                      ప్రజలు అన్నీ చూస్తున్నారని, ఎవరిని నమ్ముకుంటే తమ జీవితాలు బాగుపడతాయో వారికి తెలుసన్నారు. ’’పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. పోర్టులు వస్తున్నాయి. మూడు ప్రాంతాల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.


బాలీవుడ్ పై కన్నేసిన టాలీవుడ్ హాట్ బ్యూటీస్....

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>