MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crackmovie-updatesda745b70-a370-4ff6-9e28-9cecea2ab9ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crackmovie-updatesda745b70-a370-4ff6-9e28-9cecea2ab9ef-415x250-IndiaHerald.jpgఒక హీరో సినిమాకి... మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త విషయమేమీ కాదు. ఇలాంటివి కొందరు దర్శక నిర్మాతలు సెంటిమెంటల్ గా చేస్తుంటే... మరికొందరు వారి సినిమాపై హైప్ పెంచేందుకు ప్రముఖ సెలబ్రిటీలతో వాయిస్ ఓవర్ చెప్పిస్తూ ఉంటారు. crackmovie updates;ravi;venkatesh;gopichand;shruti;geetha;gopichand malineni;pujita ponnada;pujitha;ravi teja;sruthi;thaman s;cinema;sangeetha;hollywood;hero;samuthirakani;mass;bodyguard;krackరవితేజ 'క్రాక్' కు విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్...!రవితేజ 'క్రాక్' కు విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్...!crackmovie updates;ravi;venkatesh;gopichand;shruti;geetha;gopichand malineni;pujita ponnada;pujitha;ravi teja;sruthi;thaman s;cinema;sangeetha;hollywood;hero;samuthirakani;mass;bodyguard;krackFri, 01 Jan 2021 13:00:00 GMTహీరో సినిమాకి... మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్త విషయమేమీ కాదు. ఇలాంటివి కొందరు దర్శక నిర్మాతలు సెంటిమెంటల్ గా చేస్తుంటే... మరికొందరు వారి సినిమాపై హైప్ పెంచేందుకు ప్రముఖ సెలబ్రిటీలతో వాయిస్ ఓవర్ చెప్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇదే తరహాలో రవితేజ సినిమా క్రాక్ లో హీరో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతుండడం విశేషం. గతంలో కూడా ఓ సినిమాకి  వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. వెంకీ వాయిస్ లో ఉన్న అసహజత్వం అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది.

ఇంతకుముందు హాలీవుడ్ సినిమా 'అల్లాద్దీన్'కు వెంకటేశ్ డబ్బింగ్ చెప్పి... తన వాయిస్ తో అందర్నీ అట్రాక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రాక్ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చి స్పెషల్ అట్రాక్షన్ తీసుకురానున్నాడు వెంకీ. ఈ సినిమాకి  మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన బాడీగార్డ్ సినిమాను కూడా ఈయనే డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు అదే అనుబంధంతో ఈ సినిమాకు వెంకీని వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగినట్లు తెలుస్తోంది. అందుకు వెంకటేష్ కూడా అంగీకరించారట.

డాన్ శీను, బలుపు చిత్రాల తరవాత గోపిచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో  రానున్న ఈ హ్యాట్రిక్ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు కూడా మంచి  క్రేజ్ ను క్రియేట్ చేశాయి. ఇందులో రవితేజకు జంటగా శృతిహాసన్‌ నటిస్తుంది. ఈ సినిమాలో శృతి సరికొత్తగా కనిపించనుందట. సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ క్రేజ్ లో ఉన్న సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి రవితేజ నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంలో వెంకటేష్ వాయిస్ ఎంతవరకు ఈ సినిమాకు ఉపయోగపడుతుందో చూడాలి.


ప్రాక్టీస్ కావాలి.. లేకపోతే కష్టమే సుమీ..?

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>