PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-serious-on-temple-issues-in-ap8593e251-6e4d-4bac-86ee-efb494e77911-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-serious-on-temple-issues-in-ap8593e251-6e4d-4bac-86ee-efb494e77911-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ లో ఎప్పుడు అంత ఆగ్రహాన్ని అధికారులు చూడలేదు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల విషయంలో జగన్ అధికారులముందు సీరియస్ అయ్యారట. ఇకపై రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని ఆదేశించారట. రెండోసారి ఆలయాలపై దాడులు చేయాలన్నా, విగ్రహాలను ధ్వంసం చేయాలన్నా దుండగులకు వణుకు పుట్టాలని, ఆ దిశగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు జగన్. ys jagan;deva;jagan;police;chief minister;traffic police;qualification;application;ycp;arogyasriరెండోసారి ఆ పని చేయాలంటే వణుకు పుట్టాలి -జగన్..రెండోసారి ఆ పని చేయాలంటే వణుకు పుట్టాలి -జగన్..ys jagan;deva;jagan;police;chief minister;traffic police;qualification;application;ycp;arogyasriFri, 01 Jan 2021 08:00:00 GMTజగన్ లో ఎప్పుడు అంత ఆగ్రహాన్ని అధికారులు చూడలేదు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల విషయంలో జగన్ అధికారులముందు సీరియస్ అయ్యారట. ఇకపై రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని ఆదేశించారట. రెండోసారి ఆలయాలపై దాడులు చేయాలన్నా, విగ్రహాలను ధ్వంసం చేయాలన్నా దుండగులకు వణుకు పుట్టాలని, ఆ దిశగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు జగన్.

రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం వంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు ముఖ్యమంత్రి జగన్. దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని పేర్కొన్నారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి అలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా చర్యలుండాలని ఆయన పోలీసు అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన జగన్ ఈ మేరకు పోలీస్ డిపార్ట్ మెంట్ కి ఆదేశాలిచ్చారు.  

మరోవైపు ఇళ్ల పట్టాల వ్యవహారంపై కూడా జగన్ సీరియస్ గా దృష్టిపెట్టినట్టు  తెలుస్తోంది. అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టా రాలేదన్న మాట ఎక్కడా వినిపించడానికి వీల్లేదని సీఎం స్పష్టంచేశారు. అర్హత ఉండీ ఎవరైనా పొరపాటున మిగిలిపోతే వెంటనే వారికి పట్టా ఇవ్వాలని తెలిపారు. ‘‘అర్హులకు పథకాలు కత్తిరించే ప్రభుత్వం మనది కాదు. పేదల సంక్షేమం కోసం మనం యజ్ఞం చేస్తున్నాం. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే. అదే సమయంలో అనర్హుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం పేర్కొన్నారు. పింఛన్లు, బియ్యం కార్డులు, ఇళ్ల పట్టాలకు సంబంధించి సచివాలయాల్లో పెండింగ్‌ దరఖాస్తులేవీ లేకుండా చూసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. అర్హత ఉన్నవారికి దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పింఛను, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. ఆయా పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉండాలని మరోసారి అధికారులకు సూచించారు జగన్. లక్ష్యాలను అందుకుంటూ ముందుగు సాగాలని అధికారులకు చెప్పారు. 


ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>