Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/great-offer-to-tiktok-durgarao-in-movieseda50dc1-57b4-44f5-91d2-71a92fcdb5f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/great-offer-to-tiktok-durgarao-in-movieseda50dc1-57b4-44f5-91d2-71a92fcdb5f7-415x250-IndiaHerald.jpgటిక్‌టాక్ మనదేశంలో ఎంతో మందిని ఫేమస్ చేసింది. ఏ మాత్రం టాలెంట్ ఉన్నా వారికి వేల సంఖ్యలో ఫాలోవర్లు తయారయ్యారు. దీంతో అనేకమంది టిక్‌టాక్ స్టార్లుగా వెలుగొందారు. అయితే టిక్‌టాక్ బ్యాన్ అయినప్పటికీ వారికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ తెలుగు టిక్‌టాక్ స్టారే..durga rao;ravi;ravi teja;adinarayanareddy;cinema;jabardasth;television;dance;interview;hero;krack;manadesam;chitramటిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...durga rao;ravi;ravi teja;adinarayanareddy;cinema;jabardasth;television;dance;interview;hero;krack;manadesam;chitramFri, 01 Jan 2021 10:22:00 GMTఇంటర్నెట్ డెస్క్: టిక్‌టాక్ మనదేశంలో ఎంతో మందిని ఫేమస్ చేసింది. ఏ మాత్రం టాలెంట్ ఉన్నా వారికి వేల సంఖ్యలో ఫాలోవర్లు తయారయ్యారు. దీంతో అనేకమంది టిక్‌టాక్ స్టార్లుగా వెలుగొందారు. అయితే టిక్‌టాక్ బ్యాన్ అయినప్పటికీ వారికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ తెలుగు టిక్‌టాక్ స్టారే దుర్గారావు. పలాస చిత్రంలోని ‘నీ పక్కన పడ్డాదో లేదో చూడవే పిల్లా..’ పాటతో దుర్గారావుకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు అదే క్రేజ్‌తో ఓ బంపర్ ఆఫర్ పట్టేశాడు దుర్గారావు. ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.

రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ చిత్రంలో దుర్గారావుకు ఓ క్యారెక్టర్ లభించింది. పాత్ర చిన్నదే అయినా రవితేజ లాంటి స్టార్ సినిమాలో కావడంతో దుర్గారావు కూడా తెగ హ్యాపీగా ఉన్నాడు. తనకు ఇన్నాళ్టికి మంచి అవకాశం దొరికిందని దుర్గారావు తెగ ఆనందపడిపోతున్నాడట. అతడితో పాటు అతడి భార్యకూడా ఈ విషయం తెలిసి తెగ సంబరపడిపోతోందట. అయితే ఇది ఎలాంటి పాత్ర..? ఎంత నిడివి ఉంటుంది..? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియదు. అయితే పాత్ర చిన్నదైన తన నటనను నిరూపించుకుంటే ఇలాంటి మరిన్ని అవకాశాలను దుర్గారావు పట్టేయగలడు. అదే జరిగితే ఇక మన దుర్గారావు కూడా టాలీవుడ్‌లో పాగా వేసినట్లే లెక్క.


ఇదిలా ఉంటే విచిత్రమైన స్టెప్పులతో భార్యతో కలిసి డ్యాన్సులు వేసేవాడు దుర్గారావు. ఆ వీడియోలు ప్రేక్షకులకు నచ్చడంతో తక్కువసమయంలోనే టిక్‌టాక్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లక్షలమంది దుర్గారావుకు ఫాలోవర్లుగా మారారు. అతడి డాన్సులంటే పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌తోనే అతడికి జబర్దస్త్ ఫేం హైపర్ ఆది తన స్కిట్‌లోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి దుర్గారావు దశ తిరిగిపోయింది.

జబర్దస్త్‌లో చోటు దక్కడంతో పాటు టీవీ ప్రేక్షకుల అభిమానం కూడా లభించింది. దీంతో ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లోకే అడుగుపెట్టాడు దుర్గారావు. అతడి పట్టుదల, కృషే అతడిని ఈ స్థాయికి తీసుకొచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం అతడి సిక్స్‌ప్యాక్. కేవలం టిక్‌టాక్ కోసమే అతడు సిక్స్‌ప్యాక్ చేసినట్లు కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు. దీనిని బట్టే అతడి పట్టుదల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

‘నిర్ణయం మార్చుకుంటారా..? లేదా..’ అంటూ రజనీకాంత్ ఇంటి ఎదుట అభిమాని ఆత్మహత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>